Sakshi News home page

Global Investors Summit: 5వేల కోట్ల పెట్టుబడులు: శ్రీ సిమెంట్‌ ఛైర్మన్‌

Published Fri, Mar 3 2023 11:39 AM

Investors Comments About AP In Global Investors Summit - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో​ జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా పారిశ్రామికవేత్తలు ఏపీలో పారిశ్రామిక అవకాశాలు, భవిష్యత్త్‌లో పెట్టుబడులపై కీలక ప్రసంగం చేశారు. 

ఈ సందర్భంగా నాఫ్‌ సీఈవో సుమ్మిత్‌ బిదానీ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. ఏపీలో రోడ్‌, కనెక్టివిటీ, విద్యుత్‌ సౌకర్యాలు బాగున్నాయి. ఇన్వెస్టర్స్‌ సదస్సు పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగం అని అన్నారు. 

టోరో ఇండస్ట్రీస్‌ ఎండీ మసహిరో యమగూచి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ సహకారం మరువలేనిది. పలు కీలక రంగాల్లో వెంటనే అనుమతులు ఇచ్చారు అని అన్నారు. 

కియా ఇండియా ప్రతినిథి కబ్‌ డోంగ్‌ లి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ మద్దతు అమోఘం. రాష్ట్రాభివృద్ధికి కియా తన పాత్ర పోషిస్తోంది. అతిపెద్ద సముద్రతీరం ఉన్న రాష్ట్రం ఏపీ. రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వ సహకారాలు కియా అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఏపీలో కియా కార్యకలాపాలు సులువుగా సాగిస్తోంది. 

అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకం ఆవిష్కర్త వైఎస్సార్‌ కృషిని గుర్తు చేశారు. ఆరోగ్య రంగంలో ఏపీ సర్కార్‌  కృషి అభినందనీయం. ఏపీలో అపోలో కార్యకలాపాలకు పూర్తి సహకారం లభిస్తోంది. ఏపీలో సర్కార్‌తో అపోలో భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది. ఆరోగ్యశ్రీ ఇతర దేశాలకు విస్తరించింది అని అన్నారు. 

శ్రీ సిమెంట్‌ కంపెనీ ఛైర్మన్‌ హరిమోహన్‌ మాట్లాడుతూ.. ఏపీలో నైపుణ్యమైన మనవ వనరులు ఉన్నాయి. సీఎం జగన్‌ నాయకత్వంలో ఏపీ పరిశ్రమల హబ్‌గా మారింది. రానున్న రోజుల్లో 5వేల కోట్ల పెట్టుబడులతో 5వేల మందికి ఉపాధి కల్పింబోతున్నామని సభా వేదికపైనే స్పష్టం చేశారు. ఏపీ పారిశ్రామికీకరణలో శ్రీ సిమెంట్‌ తనదైన పాత్ర పోషిస్తుందని అన్నారు.  

Advertisement

What’s your opinion

Advertisement