50 మంది విద్యార్థులకు ఇన్‌స్పైర్‌ మానక్‌ అవార్డులు | Inspire Manak Awards for 50 students | Sakshi
Sakshi News home page

50 మంది విద్యార్థులకు ఇన్‌స్పైర్‌ మానక్‌ అవార్డులు

Dec 24 2021 3:26 AM | Updated on Dec 24 2021 3:26 AM

Inspire Manak Awards for 50 students - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలకు చెందిన 50 మంది విద్యార్థులు ఇన్‌స్పైర్‌ మానక్‌ అవార్డులకు ఎంపికయ్యారని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నిర్వహించిన ఇన్‌స్పైర్‌ మానక్‌ అవార్డ్స్‌–2021–2022కు ఎంపిక కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ అవార్డును సాధించిన విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున పారితోషికం లభించనుందని తెలిపారు. అత్యధికంగా లేపాక్షి బాలుర గురుకులంలో ఐదుగురు, పుంగనూరు(పెదపంజాని) బాలికల గురుకులంలో 4గురు అవార్డులను సాధించారని పేర్కొన్నారు. అవార్డులు సాధించిన విద్యార్థులు, పోత్సహించిన ఉపాధ్యాయులను కృష్ణమోహన్‌ అభినందించారు.    

Advertisement
 
Advertisement
Advertisement