ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ప్రారంభమైన విమాన సర్వీసులు

Indigo Air Services Started In Orvakal Airport In Kurnool District - Sakshi

సాక్షి, కర్నూలు: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమానాల సర్వీసులు ఆదివారం ప్రారంభమయ్యాయి. బెంగళూరు నుంచి తొలి ఇండిగో విమానం 52 మంది ప్రయాణికులతో కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఈ విమానానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని ఘన స్వాగతం పలికారు. అదే విమానం 72మంది ప్రయాణికులతో బెంగళూరుకు తిరుగు ప్రయాణమైంది.

దీంతో పాటు ఉదయం 10:30కి ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖ వెళ్లే మొదటి విమానాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఇక మూడు నగరాలకు ఇండిగో సంస్థ విమానాలు నడపనుంది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును గురువారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్‌ ప్రకటించారు.

చదవండి: గిరిజనుల అభ్యున్నతికి ఎన్నో చర్యలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top