60% సీట్లకు అదనపు చార్జీలు వద్దు  | DGCA has directed airlines to allocate at least 60percent of seats without charges | Sakshi
Sakshi News home page

60% సీట్లకు అదనపు చార్జీలు వద్దు 

Mar 19 2026 4:45 AM | Updated on Mar 19 2026 4:45 AM

DGCA has directed airlines to allocate at least 60percent of seats without charges

ఒకే పీఎన్‌ఆర్‌పై ప్రయాణించే వారికి ఒకే దగ్గర సీట్లివ్వాలి 

ఎయిర్‌లైన్స్‌కి డీజీసీఏ మార్గదర్శకాలు 

ప్యాసింజర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యం

న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ, వారి సౌకర్యార్థం ఎయిర్‌లైన్స్‌కి పౌరవిమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) మార్గదర్శకాలు జారీ చేసింది. సీట్ల కేటాయింపునకు సంబంధించి కనీసం 60 శాతం సీట్లపై అదనపు చార్జీలు విధించొద్దని సూచించింది. ప్రస్తుతం 20 శాతం సీట్లను ఉచితంగా బుక్‌ చేసుకోవడానికి ఉండగా మిగతా సీట్లకు అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటోంది. ఇక ఒకే పీఎన్‌ఆర్‌పై ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు ఒకే దగ్గర కూర్చునే విధంగా చూడాలని కూడా డీజీసీఏ సూచించినట్లు పౌర విమానయాన శాఖ  తెలిపింది. 

దేశీ రూట్లలోని ఫ్లయిట్స్‌కి ఇవి వర్తిస్తాయి. ప్యాసింజర్లకు మరింత వెసులుబాటు కలి్పంచేలా కీలక ఆదేశాలు జారీ చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్‌ నాయుడు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ప్రయాణికుల హక్కుల పరిరక్షణ నిబంధనల అమలును మరింత కఠినతరం చేస్తామన్నారు. దేశీ విమాన ప్రయాణాలకు సంబంధించి భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీ రూట్లలో ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగి 17.5–18.1 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య  సెపె్టంబర్‌ 2025 నాటికి 162కి చేరింది. దేశ, విదేశీ రూట్లలో ప్రయాణికుల సంఖ్య ఏప్రిల్‌–అక్టోబర్‌ 2025 మధ్య కాలంలో 23.74 కోట్లకు చేరింది.  

మార్గదర్శకాల ప్రకారం..  
→ స్పోర్ట్స్‌ పరికరాలు, సంగీత సాధనాలను పారదర్శకమైన విధంగా, సురక్షితంగా చేర్చాలి.  
→  అలాగే, పెంపుడు జంతువుల విషయంలోను స్పష్టమైన, పారదర్శకమైన విధానాలు ఉండాలి. 
→  ఫ్లయిట్స్‌ జాప్యం, రద్దు, బోర్డింగ్‌కి నిరాకరించడం తదితర కేసుల్లో ప్రయాణికుల హక్కుల పరిరక్షణ నిబంధనలను కచి్చతంగా పాటించాలి. 
→  ప్రయాణికుల హక్కులను ఎయిర్‌లైన్స్‌ వెబ్‌సైట్స్, మొబైల్‌ యాప్స్, బుకింగ్‌ ప్లాట్‌ఫాంలు, ఎయిర్‌పోర్ట్‌ కౌంటర్లలో స్పష్టంగా డిస్‌ప్లే చేయాలి. 
→  ప్రాంతీయ భాషల్లో కూడా ప్రయాణికుల హక్కులను తెలియజేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement