PNR status
-
రైలు టికెట్ రహస్యం తెలుసా?
భారతీయ రైల్వే.. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి రైళ్లపై ఆధారపడుతుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా గమనించారా? మనం బుక్ చేసుకునే ప్రతి రిజర్వేషన్ టికెట్‌పైనా 10 అంకెల పీఎన్ఆర్ (PNR) సంఖ్య ఉంటుంది. అసలు ఈ నంబర్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అది కేవలం ఒక సంఖ్యేనా లేక అందులో ఏవైనా వివరాలు దాగి ఉన్నాయా?ఏమిటీ పీఎన్ఆర్?పీఎన్ఆర్ అంటే 'ప్యాసింజర్ నేమ్ రికార్డ్'. ఇది రైల్వే డేటాబేస్‌లో ప్రయాణికుడికి కేటాయించే ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య. సీటు కన్ఫర్మ్ అయిందా లేదా? ఏ కోచ్‌లో బెర్త్ కేటాయించారు? ప్రయాణ తేదీ, రైలు వివరాలు వంటి కీలక సమాచారమంతా ఈ 10 అంకెల వెనుక నిక్షిప్తమై ఉంటుంది.పది అంకెలే ఎందుకంటే..లక్షల కొద్దీ బుకింగ్స్ జరిగే మన దేశంలో, తక్కువ అంకెలు ఉంటే నంబర్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఎక్కువ అంకెలు ఉంటే గుర్తుంచుకోవడం కష్టం. అందుకే, నిర్వహణకు సులభంగా ఉంటూనే, బిలియన్ల కొద్దీ ప్రత్యేకమైన కాంబినేషన్లను సృష్టించేందుకు 10 అంకెల ఫార్మాట్‌ను రైల్వే ఎంచుకుంది.ఈ 10 అంకెలు యాదృచ్ఛికంగా ఇచ్చేవి కావు. ఇందులో ప్రతి అంకెకు ఒక అర్థం ఉంది.మొదటి అంకె: ఇది టికెట్ ఏ రైల్వే జోన్ లేదా ఏ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ద్వారా బుక్ అయిందో సూచిస్తుంది. ఉదాహరణకు 2 లేదా 3 తో మొదలైతే అది సికింద్రాబాద్ (SCR) వంటి జోన్లకు సంబంధించినదిగా గుర్తించవచ్చు.మొదటి 3 అంకెలు: ఇవి రిజర్వేషన్ జరిగిన జోనల్ క్లస్టర్‌ను తెలియజేస్తాయి.చివరి 7 అంకెలు: ఇవి సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యే యూనిక్ నంబర్లు. ఇవి ఒకే ప్రయాణంలో ఇద్దరు వ్యక్తులకు ఒకే నంబర్ రాకుండా అడ్డుకుంటాయి.పీఎస్ఆర్ వ్యవస్థ ఎందుకు కీలకం?కోట్లాది మంది డేటాను గందరగోళం లేకుండా నిర్వహించడానికి పీఎన్ఆర్ వ్యవస్థ వెన్నెముకలా పనిచేస్తుంది. దీని ద్వారా వెయిటింగ్ లిస్ట్ (WL) లేదా RAC లో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఒకే సీటు ఇద్దరికి కేటాయించకుండా ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది.అత్యవసర సమయాల్లో ప్రయాణికుల పూర్తి వివరాలను రైల్వే అధికారులు త్వరగా సేకరించేందుకు ఇది తోడ్పడుతుంది.మనం సాధారణంగా చూసే ఆ 10 అంకెల కోడ్ వెనుక ఇంతటి భారీ సాంకేతిక వ్యవస్థ దాగి ఉంది. భారత్ వంటి భారీ జనాభా ఉన్న దేశంలో రైలు ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడంలో పీఎన్ఆర్ నంబర్ పోషిస్తున్న పాత్ర అమోఘం. ఈ సారి మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఈ వివరాలన్నీ మీ పీఎన్ఆర్లో గమనించండి. -
60% సీట్లకు అదనపు చార్జీలు వద్దు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ, వారి సౌకర్యార్థం ఎయిర్‌లైన్స్‌కి పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) మార్గదర్శకాలు జారీ చేసింది. సీట్ల కేటాయింపునకు సంబంధించి కనీసం 60 శాతం సీట్లపై అదనపు చార్జీలు విధించొద్దని సూచించింది. ప్రస్తుతం 20 శాతం సీట్లను ఉచితంగా బుక్ చేసుకోవడానికి ఉండగా మిగతా సీట్లకు అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటోంది. ఇక ఒకే పీఎన్ఆర్పై ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు ఒకే దగ్గర కూర్చునే విధంగా చూడాలని కూడా డీజీసీఏ సూచించినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. దేశీ రూట్లలోని ఫ్లయిట్స్‌కి ఇవి వర్తిస్తాయి. ప్యాసింజర్లకు మరింత వెసులుబాటు కలి్పంచేలా కీలక ఆదేశాలు జారీ చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రయాణికుల హక్కుల పరిరక్షణ నిబంధనల అమలును మరింత కఠినతరం చేస్తామన్నారు. దేశీ విమాన ప్రయాణాలకు సంబంధించి భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీ రూట్లలో ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగి 17.5–18.1 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య సెపె్టంబర్ 2025 నాటికి 162కి చేరింది. దేశ, విదేశీ రూట్లలో ప్రయాణికుల సంఖ్య ఏప్రిల్–అక్టోబర్ 2025 మధ్య కాలంలో 23.74 కోట్లకు చేరింది. మార్గదర్శకాల ప్రకారం.. → స్పోర్ట్స్ పరికరాలు, సంగీత సాధనాలను పారదర్శకమైన విధంగా, సురక్షితంగా చేర్చాలి. → అలాగే, పెంపుడు జంతువుల విషయంలోను స్పష్టమైన, పారదర్శకమైన విధానాలు ఉండాలి. → ఫ్లయిట్స్ జాప్యం, రద్దు, బోర్డింగ్‌కి నిరాకరించడం తదితర కేసుల్లో ప్రయాణికుల హక్కుల పరిరక్షణ నిబంధనలను కచి్చతంగా పాటించాలి. → ప్రయాణికుల హక్కులను ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్స్, మొబైల్ యాప్స్, బుకింగ్ ప్లాట్‌ఫాంలు, ఎయిర్పోర్ట్ కౌంటర్లలో స్పష్టంగా డిస్ప్లే చేయాలి. → ప్రాంతీయ భాషల్లో కూడా ప్రయాణికుల హక్కులను తెలియజేయాలి. -
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజులు రిజర్వేషన్లు బంద్!
కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న భారత రైల్వే.. టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి PRS అనే కంప్యూటరైజ్డ్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా దేశంలోని ఏ రైల్వే స్టేషన్ నుంచైనా రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ సిస్టమ్ పనితీరును మెరుగుపరచడానికి.. సాంకేతిక నిర్వహణ పనులు చేపట్టాల్సి వచ్చింది.సిస్టమ్ అప్‌గ్రేడ్ కారణంగా కొన్ని గంటల పాటు ముఖ్యమైన సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి ప్రయాణికులు ముందుగా ఈ విషయాన్ని తెలుసుకొని తమ ప్రయాణ ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఢిల్లీ పీఆర్ఎస్ సిస్టమ్‌తో అనుసంధానమైన సేవలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.రైల్వే అధికారుల ప్రకారం.. మార్చి 14 అర్ధరాత్రి నుంచి, మార్చి 15 అర్ధరాత్రి వరకు.. అంటే ఈ రెండు రోజులు నిర్వహణ పనులు జరుగుతాయి. ప్రతి రాత్రి సుమారు మూడు గంటల పాటు PRS సేవలు అందుబాటులో ఉండవు. ఈ సమయంలో కొన్ని ఆన్లైన్ & టెలిఫోన్ సేవలు పనిచేయవు.ఆన్లైన్ టికెట్ బుకింగ్, టికెట్ రద్దు, పీఎన్ఆర్ స్టేటస్ చెక్, కరెంట్ రిజర్వేషన్ సమాచారం, టికెట్‌కు సంబంధించిన ఇతర విచారణలు మాత్రమే కాకుండా.. ఇండియన్ రైల్వేస్ అందించే 139 పీఎన్ఆర్ విచారణ సేవ కూడా పనిచేయదు.PRS అంటే?PRS (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం) అనేది భారతీయ రైల్వే రూపొందించిన కంప్యూటరైజ్డ్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా రైల్వే టికెట్‌కు సంబంధించిన.. టికెట్ బుకింగ్, టికెట్ క్యాన్సిల్, తత్కాల్ టికెట్ జారీ, వెయిటింగ్ లిస్ట్ స్టేటస్, ట్రైన్ చార్ట్ తయారీ మొదలైన సేవలను అందిస్తుంది.రెండు రోజుల అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని.. అవసరమైన టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవడం, అత్యవసర ప్రయాణాలకు ముందస్తు ప్రణాళిక చేయడం వంటివి ముందుగానే చేసుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచనలు జారీ చేశారు. ఈ తాత్కాలిక నిలిపివేత అనేది సిస్టమ్ పనితీరును మెరుగుపరచడం కోసం మాత్రమేనని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ప్రయాణికులకు మరింత వేగవంతమైన మరియు సులభమైన సేవలను అందించడమే ఈ నిర్వహణ పనుల లక్ష్యమని చెప్పారు. -
వాట్సాప్‌లో పీఎన్ఆర్ స్టేటస్
కరోనా మహమ్మారి కారణంగా రైల్వే ప్రయాణికులు సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్న ఐఆర్సీటీసీ. తాజాగా మరో కొత్త సదుపాయాన్ని ప్రయాణికులకు కల్పిస్తున్నట్లు పేర్కొంది. రైలు ప్రయాణం కోసం ఆన్లైన్ సేవలు వినియోగించుకునే వారి సంఖ్య ఎక్కువ కావడంతో.. మరిన్ని సేవలను ఆన్ లైన్ లో తీసుకొచ్చింది. తాజాగా వాట్సాప్ ద్వారా రియల్ టైమ్ పిఎన్ఆర్ స్టేటస్ మరియు ట్రైన్ జర్నీ సమాచారాన్ని పొందటానికి వినియోగదారులు పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. “రైలు యొక్క పీఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్, ఆలస్యానికి సంబంధించిన వివరాలు, రాబోయే స్టాప్లకు సంబంధించిన వంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇతర వెబ్సైట్లలో వెతకడం ద్వారా మీ సమయాన్ని వృదా చేసుకోకుండా ఉండటానికి రైలోఫీ అనే కొత్త సౌకర్యాన్ని కల్పించనట్లు” సంస్థ తెలిపింది. (చదవండి: ప్రమాదంలో 2కోట్ల చైనా మొబైల్స్) దీనికోసం మన వాట్సాప్ లో రైలోఫీకి చెందిన మొబైల్ నెంబర్ ని +91 9881193322 సేవ్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు బుక్ చేసుకున్న రైలు యొక్క 10 అంకెల పీఎన్ఆర్ నంబర్‌ను రైలోఫీకి వాట్సాప్ లో మెసేజ్ ద్వారా పంపించాలి. అప్పుడు మీరు ఎక్కబోయే ట్రైన్ లేట్‌గా నడుస్తుందా? టైమ్‌కే వస్తుందా? అనే సమాచారాన్ని కూడా మీరు వాట్సాప్‌లోనే పొందవచ్చు. దీంతోపాటు ట్రైన్లో తర్వాత రాబోయే స్టేషన్ సమాచారం కూడా పొందవచ్చు. కంపెనీ తెలుపుతున్న వివరాల ప్రకారం, రోజుకి కోటి మంది పీఎన్ఆర్ స్టేటస్ గురుంచి గూగుల్ సెర్చ్ చేస్తునట్టు తెలిపింది. ఈ కొత్త సర్వీస్ ద్వారా వినియోగదారులకు వాట్సాప్‌లోనే దీనికి సంబంధించిన స్టేటస్‌ను చూసుకునే అవకాశం ఉంది. -
వెయిటింగ్ లిస్ట్ పాసింజర్లకు ఆటోమేటిక్ ఎస్ఎమ్మెస్!
న్యూఢిల్లీ: రైల్వే రిజర్వేషన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే పాసింజర్లకు రైల్వేశాఖ కొన్ని సదుపాయాలను కల్పించింది. వెయిటింగ్ లిస్ట్ లో ఉండే పాసింజర్లకు టికెట్ కన్ ఫర్మ్ కాగానే పీఎన్ఆర్ స్టాటస్ తెలిపే విధంగా ఆటోమెటిక్ ఎస్ఎమ్మెస్ ను పంపే ఏర్పాటును రైల్వే శాఖ చేపట్టారు. ఇవియే కాకుండా ఆన్ లైన్ లో భోజనాన్ని బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించే విధంగా పాసింజర్లకు వెసలుబాటును ఈ బడ్జెట్ లో కల్పించారు. అన్ రిజర్వుడు కేటగిరిలో టికెట్లను మొబైల్ ఫోన్ల ద్వారా బుక్ చేసుకునే విధంగా సదుపాయాన్ని, ఆటోమెటిక్ వెండింగ్ మిషన్లలో నగదు ద్వారా టికెట్ కొనుగోలు చేసే సౌకర్యాన్ని రైల్వేశాఖ కల్పించింది. బుధవారం ప్రవేశపెట్టిన రైల్వే శాఖ బడ్జెట్ లో పలు అంశాలను రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖార్గే వెల్లడించారు.


