వాట్సాప్‌లో పీఎన్ఆర్ స్టేటస్

Check Train PNR Status Directly From WhatsApp With Railofy - Sakshi

కరోనా మహమ్మారి కారణంగా రైల్వే ప్రయాణికులు సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్న ఐఆర్‌సీటీసీ. తాజాగా మరో కొత్త సదుపాయాన్ని ప్రయాణికులకు కల్పిస్తున్నట్లు పేర్కొంది. రైలు ప్రయాణం కోసం ఆన్లైన్ సేవలు వినియోగించుకునే వారి సంఖ్య ఎక్కువ కావడంతో.. మరిన్ని సేవలను ఆన్ లైన్ లో తీసుకొచ్చింది. తాజాగా వాట్సాప్ ద్వారా రియల్ టైమ్ పిఎన్‌ఆర్ స్టేటస్ మరియు ట్రైన్ జర్నీ సమాచారాన్ని పొందటానికి వినియోగదారులు పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. “రైలు యొక్క పీఎన్‌ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్, ఆలస్యానికి సంబంధించిన వివరాలు, రాబోయే స్టాప్‌లకు సంబంధించిన వంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇతర వెబ్‌సైట్లలో వెతకడం ద్వారా మీ సమయాన్ని వృదా చేసుకోకుండా ఉండటానికి రైలోఫీ అనే కొత్త సౌకర్యాన్ని కల్పించనట్లు” సంస్థ తెలిపింది. (చదవండి: ప్రమాదంలో 2కోట్ల చైనా మొబైల్స్)

దీనికోసం మన వాట్సాప్ లో రైలోఫీకి చెందిన మొబైల్ నెంబర్ ని +91 9881193322 సేవ్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు బుక్ చేసుకున్న రైలు యొక్క 10 అంకెల పీఎన్ఆర్ నంబర్‌ను రైలోఫీకి వాట్సాప్ లో మెసేజ్ ద్వారా పంపించాలి. అప్పుడు మీరు ఎక్కబోయే ట్రైన్ లేట్‌గా నడుస్తుందా? టైమ్‌కే వస్తుందా? అనే సమాచారాన్ని కూడా మీరు వాట్సాప్‌లోనే పొందవచ్చు. దీంతోపాటు ట్రైన్‌లో తర్వాత రాబోయే స్టేషన్ సమాచారం కూడా పొందవచ్చు. కంపెనీ తెలుపుతున్న వివరాల ప్రకారం, రోజుకి కోటి మంది పీఎన్ఆర్ స్టేటస్ గురుంచి గూగుల్ సెర్చ్ చేస్తునట్టు తెలిపింది. ఈ కొత్త సర్వీస్ ద్వారా వినియోగదారులకు వాట్సాప్‌లోనే దీనికి సంబంధించిన స్టేటస్‌ను చూసుకునే అవకాశం ఉంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top