ప్రమాదంలో 2కోట్ల చైనా మొబైల్స్

Gionee Found Guilty Of Infecting 20 Million Phones - Sakshi

చైనాలో దిగ్గజ కంపెనీ జియోనీ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చైనాలోని ఒక న్యాయస్థానం జియోనీ ఫోన్‌లతో సంబంధం ఉన్న ఒక వివాదాస్పద అంశంపై తీర్పు ఇచ్చింది. చైనా జడ్జిమెంట్ డాక్యుమెంట్ నెట్‌వర్క్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, జియోనీ ఫోన్‌లలో ఉద్దేశపూర్వకంగానే 2 కోట్లకుపైగా ఫోన్లలో ట్రోజన్ హార్స్ అనే వైరస్ ను సంస్థ ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. డిసెంబర్ 2018 మరియు అక్టోబర్ 2019 మధ్య ఒక యాప్ ద్వారా 20 మిలియన్లకు పైగా జియోనీ ఫోన్లలలో ఉద్దేశపూర్వకంగా ప్రవేశ పెట్టిన ట్రోజన్ హార్స్‌ వైరస్ తో దెబ్బతిన్నాయని కోర్టు కనుగొంది. “స్టోరీ లాక్ స్క్రీన్” ప్రత్యేక యాప్ వినియోగదారుల నుండి అయాచిత ప్రకటనలు మరియు ఇతర చట్టవిరుద్ధ మార్గాల ద్వారా లాభాల సాధనంగా ఉపయోగబడిందని నివేదిక పేర్కొంది. (చదవండి: ఐఫోన్‌13 కెమెరా ఫీచర్లు వైరల్) 

“స్టోరీ లాక్ స్క్రీన్” యాప్ యొక్క అప్డేట్ ద్వారా వినియోగదారుల ఫోన్‌లలో ట్రోజన్ హార్స్ ప్రోగ్రామ్‌ను అమర్చడానికి షెన్‌జెన్ జిపు టెక్నాలజీ(జియోనీ యొక్క అనుబంధ సంస్థ)తో ఒప్పందం కుదర్చుకున్నట్లు కోర్టు తెలిపింది. నివేదిక తెలిపినట్లుగా, "పుల్ పద్ధతి"ని ఉపయోగించి వినియోగదారుకు తెలియకుండా సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్ గా జియోనీ మొబైల్ ఫోన్‌లలో అప్డేట్ చేసారని కోర్టు పేర్కొంది. దీని కోసం జియోనీ 40 లక్షల డాలర్లు ముడుపులు ఇచ్చుకుంది. 2018లో మొదటిసారిగా వారు ఈ వైరస్‌ను ఫోన్లలో ఇన్‌స్టాల్ చేయడం ప్రారంభించారు. 2019 అక్టోబర్ వరకు ఇలాగే కొనసాగించారు. ఈ పద్దతిలో 21.75 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రభావితం చేయడంతో ద్వారా.. కంపెనీ సుమారు 4.2 మిలియన్లు అర్జించినట్లు తేలింది. మొబైల్ పరికరాలను చట్టవిరుద్ధంగా నియంత్రించినందుకు న్యాయస్థానం.. గ్జూ లి, జో యింగ్, జియా జెంగ్కియాంగ్, పాన్ క్వి లను దోషులుగా తేల్చింది. వారికి 3 నుంచి 3.5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 22,59,738 రూపాయల జరిమానా విధించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top