సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ల కన్సాలిడేటెడ్‌ వేతనాల పెంపు

Increase in Consolidated Salaries of Civil Assistant Surgeons - Sakshi

రూ.53,500 నుంచి రూ.85 వేలకు.. ప్రొబేషన్‌ 3 నుంచి 2 ఏళ్లకు కుదింపు

సాక్షి, అమరావతి: ఏపీ వైద్య విధాన పరిషత్‌ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (స్పెషాలిటీ) వైద్యుల కన్సాలిడేటెడ్‌ వేతనాన్ని రూ.53,500 నుంచి రూ.85 వేలకు ప్రభుత్వం పెంచింది. ప్రొబేషన్‌ కాలాన్నీ మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఇటీవల వైద్య విధాన పరిషత్‌ గిరిజన ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు వేతనాల్లో ప్రోత్సాహకాలను ప్రకటించారు.

బేసిక్‌ పే మీద స్పెషాలిటీ వైద్యులకు 50%, సాధారణ వైద్యులకు 30% ప్రోత్సాహకం ఇచ్చారు. ఆ వెంటనే స్పెషలిస్ట్‌ వైద్యులకు కన్సాలిడేట్‌ వేతనాలను పెంచడం గమనార్హం. 2020లో జీవో నంబర్‌ 60 ద్వారా నియమితులైన వైద్యులకు ఈ నెల నుంచి పెంచిన వేతనాలు అమల్లోకొస్తాయి. తాజాగా నియమితులయ్యే వైద్యులకూ రూ.85 వేల కన్సాలిడేటెడ్‌ వేతనాన్ని ఖరారు చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top