IMD Says Rain Forecast To Andhra Pradesh For Two Days - Sakshi
Sakshi News home page

IMD Alert: నెలాఖరులోగా మరో అల్పపీడనం!

Nov 24 2022 3:41 AM | Updated on Nov 24 2022 10:02 AM

IMD Says Rain Forecast To Andhra Pradesh For Two Days - Sakshi

సాక్షి, విశాఖపట్నం: కొద్దిరోజుల కిందట నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్రపై అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇది గురువారం పూర్తిగా బలహీనపడనుంది. దీనికి అనుబంధంగా సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నైరుతి వైపు వంగి ఉంది.

దీనిఫలితంగా రానున్న రెండురోజులు రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది.  

నెలాఖరులోగా ఉత్తర అండమాన్‌ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడి, బలపడే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బుధవారం ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో  మోస్తరు వర్షాలు కురిశాయి.  

Advertisement
 
Advertisement
Advertisement