టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా | Illegal sand trafficking in Andhra pradesh | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా

Aug 3 2025 3:50 AM | Updated on Aug 3 2025 3:50 AM

Illegal sand trafficking in Andhra pradesh

పోలీసులతో ఫోనులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

గంజాయి బ్యాచ్‌ ఆధ్వర్యంలోనే అక్రమాలు 

సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే కొలికపూడి ఆగ్రహం

తిరువూరు: ఆంధ్ర నుంచి తెలంగాణకు టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఇసుక అక్రమంగా తరలిపో­తోందని ఎన్టీఆర్ ‌ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ రవాణాతో టీడీపీ నేతలు అక్రమార్జనకు పా­ల్పడుతున్నారని విమర్శించారు. శుక్రవారం అర్ధరాత్రి తిరువూరు మండలంలోని పెద్దవరం వద్ద తెలంగాణ సరిహద్దుల్లో ఎంపీ కేశి­నేని చిన్ని అనుచ­రులు ఇసుక అక్రమంగా నిల్వ చేసి అమ్ముతున్నా­రని సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కొలికపూడి, ఆ గ్రామం వెళ్లి డంపింగ్‌ చేసిన ఇసుకను పరిశీలించారు.

ఒకే వ్యక్తి పేరుతో ఇసుక నమోదు చేసి తెలంగాణకు తరలిస్తున్నారని, ఈ అక్రమ రవాణాను పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ఏసీపీ ప్రసాదరావుపై ఫోనులోనే విరుచుకుపడ్డారు. ఇటీవ­ల తిరువూరులో ఘర్షణకు పాల్పడిన గంజాయి బ్యా­చ్‌ ఆధ్వర్యంలోనే ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని, పోలీసులు నేరాల అదుపులో ఎందుకు ఉ­దాసీనంగా వ్యవహరిస్తున్నా­రని ఎమ్మెల్యే మండి­పడ్డారు. సీసీ కెమెరా­లు ఏర్పాటు చేసి పటిష్ట ని­ఘా ఉంచామని, నేరాలు అదుపు చేస్తామ­ని చెబుతు­న్న పోలీసులు అవసరమైన చోట సీసీ కెమెరా­లు లేకుండా జాగ్రత్త పడుతున్నారని ఎద్దేవా చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement