రైతన్నలకు విరివిగా రుణాలు.. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ముందుకొస్తున్న బ్యాంకర్లు | Sakshi
Sakshi News home page

రైతన్నలకు విరివిగా రుణాలు.. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ముందుకొస్తున్న బ్యాంకర్లు

Published Tue, Aug 2 2022 3:22 AM

Huge loans to farmers in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ చొరవతో చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకులు విరివిగా రుణాలు అందచేస్తున్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతేడాది సెప్టెంబర్‌ వరకు కొత్తగా 12.74 లక్షల మంది చిన్నకారు రైతులకు, 7.81 లక్షల మంది సన్నకారు రైతులకు బ్యాంకులు కొత్తగా రూ.56,256.90 కోట్ల మేర వ్యవసాయ రుణాలను మంజూరు చేశాయి. చిన్న కారు రైతులకు రూ.40,787.50 కోట్లు, సన్నకారు రైతులకు రూ.15,469.40 కోట్లు రుణాలు కొత్తగా మంజూరయ్యాయి. దీంతో చిన్న, సన్నకారు రైతులకు మంజూరైన మొత్తం రుణం రూ.1,48,085.14 కోట్లకు చేరుకుంది. 

అంతకు మించి రుణాలు..
మొత్తం రుణాల్లో బ్యాంకులు చిన్న, సన్నకారు రైతులకు 9 శాతం మేర ఇవ్వాలని ఆర్బీఐ నిబంధనలు స్పష్టం చేస్తుండగా రాష్ట్రంలో అంతకు మించి 27.76 శాతం మేర మంజూరు కావడం గమనార్హం. సకాలంలో పంట రుణాలను చెల్లించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ రాయితీని అమలు చేస్తోంది. సక్రమంగా చెల్లిస్తుండటంతో బ్యాంకులు కూడా రైతులకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి.

పంటలు వేసిన రైతులందరి వివరాలను ఆర్బీకేల ద్వారా సేకరించి బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక ప్రకారం 2019 వరకు టీడీపీ హయాంలో, ఆ తరువాత గతేడాది సెప్టెంబర్‌ వరకు చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకు రుణాల మంజూరు వివరాలు ఇవీ..

Advertisement
Advertisement