స్వాతంత్య్ర ఫలాలు పేదలకు అందాలి 

HRC Chairmen Comments On freedom to poor people - Sakshi

హెచ్‌ఆర్‌సీ చైర్మన్‌ 

కర్నూలు(సెంట్రల్‌): స్వాతంత్య్ర ఫలాలు పేదలకు అందినప్పుడే నిజమైన సంతృప్తి అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌ జస్టిస్‌ మంథాత సీతారామమూర్తి చెప్పారు. కర్నూలులోని హెచ్‌ఆర్‌సీ కార్యాలయంలో గురువారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి దిక్సూచిగా, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వాలకు నిలయంగా మారుతోందని చెప్పారు.

స్వాతంత్య్ర పోరాటంలో  అసువులు బాసిన వారందరిని స్మరించుకోవడం  పౌరుల బాధ్యత అని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు సమన్వయంతో వ్యవహరించినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. హెచ్‌ఆర్‌సీ జ్యుడిషియల్‌ సభ్యుడు దండే సుబ్రమణ్యం, సిబ్బంది పాల్గొన్నారు. 

అసమానతలు బాధాకరం 
లోకాయుక్త జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి 
దేశంలో నేటికీ ధనిక, పేదవర్గాలు, కులమతాలు, ప్రాంతీయ వ్యత్యాసాలు ఉండటం బాధాకరమని లోకాయుక్త జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి చెప్పారు. కర్నూలులోని లోకాయుక్త కార్యాలయం ఆవరణలో గురువారం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   స్వాతంత్య్రఫలాలు పౌరులందరికీ సమానంగా అందించేందుకు పాలకులు, అధికారులు కృషిచేయాలని కోరారు.  చెస్, క్యారమ్స్, ముగ్గులు, క్రికెట్‌ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. లోకాయుక్త ఇన్‌స్పెక్టర జనరల్‌ నరసింహారెడ్డి, రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top