ఏయ్‌.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య  

Hindupur MLA Balakrishna Angry Over TDP Leaders - Sakshi

నవ్వకండి.. సీరియస్‌ మ్యాటర్‌ ..

హిందూపురం: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ సారి టీడీపీ నాయకులపైనే తన దుడుకుతనాన్ని ప్రదర్శించారు. గురువారం సుగూరు ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా... ఆయన హావభావాలు చూసిన టీడీపీ నేతలతో పాటు ప్రజలు ఫక్కున నవ్వారు. దీనిపై బాలయ్య సీరియస్‌ అయ్యారు. బాలయ్య ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘యువత చెడిపోతున్నారు. చాలా పొద్దెక్కే వరకు పడుకోవడం.. రాత్రయితే బండ్లేసుకుని అదో రకంగా రోడ్లలో స్ట్రీట్‌ లైట్లు చూసుకుంటూ.. ఆ.. చుక్కలు లెక్కెడుతూ.. వీళ్లలా పోవడం ఏదో ఢీ కొట్టడం.. (ఈ సమయంలో ఆకాశంలో చూస్తూ చేతులు గాలిలో ఊపుతూ ఊగుతూ మాట్లాడడం చూసిన హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి, స్థానిక నేతలు, ప్రజలు ఫక్కున నవ్వారు).

ఏయ్‌.. నవ్వకండి.. (బీకే పార్థసారథి వైపు వేలు చూపిస్తూ) ఇట్స్‌ ఏ సీరియస్‌ మ్యాటర్‌(సీరియస్‌ అంటూ టీడీసీ నేతలు కోరస్‌ పలికారు). నాకు తెలుసు.. చాలా మంది అలా తయారవుతున్నారు. సో.. జాగ్రత్తగా ఉండు(వేలు చూపిస్తూ) మనుషులు... మనుషులుగా చూస్తే.. లేదా విప్లవమే. నేనూ చాలా చదివాను. రిమ్యాగ్జన్స్, ఫ్రెంచ్‌ రెవల్యూషన్స్‌.. ఆ... ఇవన్నీ కూడా. అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. ఏం జరిగిందో అప్పుడు రొట్టె చేతిలో పట్టుకుని వెళ్లి.. ప్యాలెస్‌.. హూ ఇజ్‌ ద సిక్సిటిన్త్‌.. ఆ... మహరాజునే బయటకు లాక్కొచ్చి.. తీసుకొచ్చి.. (తల నిలువుగా ఆడిస్తూ.. ) జాగ్రత్తగా ఉండండి. ఆ పరిస్థితి తీసుకురావద్దు. హెచ్చరిస్తున్నా.’’

చదవండి:
ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం
మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు బిగుస్తోన్న ఉచ్చు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top