హైపవర్‌ కమిటీ నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆమోదం

High Power Committee Report For Tent Results Approved By AP Government - Sakshi

అమరావతి: టెన్త్‌ ఫలితాల కోసం హైపవర్‌ కమిటీ సమర్పించిన నివేదికకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదం  తెలిపింది. కోవిడ్‌ కారణంగా పరీక్షలు రద్దు కావడంతో.. ఫలితాల వెల్లడికి అనువైన విధానంపై ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం హైపవర్‌ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. హైపవర్‌ కమిటీ సిఫార్సుల మేరకు టెన్త్‌ ఫలితాలు ప్రకటన విడుదల చేశారు.

2019-20 విద్యా సంవత్సరానికి గ్రేడ్లు ప్రకటించి, 2020లో పాస్‌ సర్టిఫికెట్లు ఇచ్చి వారందరికీ గ్రేడ్‌ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అంతర్గతంగా 50 మార్కుల చొప్పున నిర్వహించిన.. 3 ఫార్మెటివ్‌ అసిస్మెంట్ల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా 2021 ఏడాది విద్యార్థులందరికీ అంతర్గత అసెస్మెంట్‌ మార్కులను 30 శాతానికి.. 70 శాతం వెయిటేజి స్లిప్‌ టెస్టులకు ఇవ్వాలని హైపవర్‌ కమిటీ సిఫార్సు చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top