మానవాళికి ముప్పుగా ఉంటే ఏ చెట్లనైనా కొట్టేయొచ్చు | High Court bench on felling of Kono Corpus trees | Sakshi
Sakshi News home page

మానవాళికి ముప్పుగా ఉంటే ఏ చెట్లనైనా కొట్టేయొచ్చు

Sep 5 2024 5:33 AM | Updated on Sep 5 2024 5:33 AM

High Court bench on felling of Kono Corpus trees

కోనో కార్పస్‌ చెట్ల కొట్టివేతపై హైకోర్టు ధర్మాసనం

చెట్ల కొట్టివేతపై పూర్తి వివరాలివ్వాలని ప్రభుత్వానికి ఆదేశం

మీరెన్ని చెట్లు నాటారో చెప్పాలని పిటిషనర్లకు ఆదేశం

విచారణ నవంబర్‌ 6కి వాయిదా

సాక్షి, అమరావతి : మానవాళికి ముప్పుగా పరిణవిు­ం­చినప్పుడు ఏ చెట్లనైనా కొట్టేయడంలో తప్పేమీ లే­దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీ­రజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపా­టి రవి ధర్మాసనం అభిప్రాయపడింది. కోనో కా­ర్ప­స్‌ చెట్ల విషయంలో అలాంటి ముప్పు ఉందని భా­వించే వాటిని నరికేస్తుండవచ్చని తెలిపింది. జ­మ్ము కశ్మీర్‌లో ఇలాగే ఓ రకం చెట్ల నుంచి వచ్చే దూ­ది లాంటి పదార్థం వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందు­లు పడ్డారని, చివరికి ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి వ్యక్తీ మాస్క్‌ ధరించాల్సి వచ్చేదని తె­లి­పింది. 

కోనో కార్పస్‌ చెట్ల విషయంలో కూడా అ­లాంటి పరిస్థితి ఉండొచ్చునని, అందుకే వాటిని తొ­ల­ గించాలని నిర్ణయించి ఉంటారని చెప్పింది. కోనో కా­ర్పస్‌ చెట్లను కొట్టేయకుండా, ఇవి మానవాళికి హా­ని­కరమో కాదో తేల్చేందుకు నిపుణుల కమిటీని ని­య­మించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జ­న విజ్ఞాన వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, నాగార్జున వ­ర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె.బయపురెడ్డి, హై­దరాబాద్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కె.రామచంద్రా­రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యా­జ్యం (పిల్‌)పై సీజే ధ­ర్మాసనం బుధవారం మరోసారి వి­చా­రణ జరిపింది. 

రా­ష్ట్ర ప్రభుత్వం తరఫు­న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణుతే­జ వాదనలు వినిపిస్తూ.. కోనో కార్పస్‌ చెట్లపై ప్ర­జ­ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, వా­టి ఆధారంగా కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో దా­దాపు 645 చెట్లు కొట్టేశారన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది నర్రా శ్రీని­వాసరావు స్పందిస్తూ.. శాస్త్రీయ అధ్యయనం చేయకుండా చెట్లను కొట్టేయడం సరికాదన్నారు. 

వాదనలు విన్న ధర్మాసనం ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు చెట్లు నాటేందుకు మీరేం చర్యలు తీసుకున్నారు? ఇప్పటివరకు ఎన్ని నాటారు వంటి వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్‌ 6కి వాయిదా వేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement