ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు | Heavy Flood Water Reach Prakasam Barrage | Sakshi
Sakshi News home page

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు

Aug 13 2020 1:05 PM | Updated on Aug 13 2020 1:50 PM

Heavy Flood Water Reach Prakasam Barrage - Sakshi

సాక్షి, విజయవాడ: మున్నేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు చేరుతోంది.దీంతో 12 గేట్లు అడుగు మేర ఎత్తివేశారు. వరదనీరు ఎక్కువగా వస్తే మరిన్ని గేట్లు ఎత్తుతామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి ఇన్‌ఫ్లో 20 వేల క్యూసెక్కులు ఉండగా, రాత్రికి మరింత పెరిగే అవకాశముంది. ఔట్‌ఫ్లో 7500 క్యూసెక్కులుగా నమోదయ్యింది. తాగునీటి కోసం 13,500 క్యూసెక్కులు తూర్పు కెనాల్‌, పశ్చిమ కెనాల్‌ ద్వారా విడుదల చేశారు.రెండు రోజుల పాటు వరద ప్రవాహం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement