నేతన్నకు భరోసా వస్త్ర ప్రదర్శనలతో మార్కెటింగ్‌కు ప్రోత్సాహం

Handloom Textile Exhibition: Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: చేనేత వస్త్రాలకు ప్రచారం, విక్రయాలను విస్తృతం చేసేలా ఎగ్జిబిషన్‌(వస్త్ర ప్రదర్శన)లు దోహదం చేస్తాయనడంలో ఏమాత్రం సందేహంలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు మార్కెటింగ్‌కు అవసరమైన సహకారం అందిస్తోంది. సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే చేనేత వస్త్రాలను అపురూప నైపుణ్యం, సృజనాత్మకతతో అందించే నేతన్నలకు భరోసాగా నిలవడంలో ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది.

గత నాలుగేళ్లలో 23 భారీ చేనేత వస్త్ర ప్రదర్శనలు­(ఎగ్జిబిషన్‌) నిర్వహించగా, 392 చేనేత సహకార సంఘాలు పాల్గొన్నాయి. మొత్తం ఎగ్జిబిషన్‌లలో రూ. 21.62 కోట్లు విక్రయాలు జరిగేలా రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రత్యేక చొరవ తీసుకోవడం విశేషం. కోవిడ్‌ సమయంలో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్‌కు కొంత ఇబ్బంది వచ్చినప్పటికీ మిగిలిన సమయంలో వా టిని విరివిగా నిర్వహించి చేనేత సహకార సంఘా లకు తమ ఉత్పత్తుల అమ్మకాలకు ఊతమిచ్చింది. ప్రతి యేటా అంతర్జాతీయ చేనేత దినోత్సవం రోజైన ఆగస్టు 7 నుంచి వారం పాటు రాష్ట్ర వ్యాప్తంగా హ్యాండ్లూమ్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నారు.

రాష్ట్ర స్థాయిలోనే కాక, జాతీయ స్థాయిలో  పేరు ప్రఖ్యా తులు గడించిన చేనేత ఉత్పత్తి సంఘాలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఇదే సందర్భంలో ఫ్యాషన్‌ షో నిర్వహించి చేనేత వస్త్రాలు ప్రదర్శించి వస్త్ర ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. వారం­లో ఒక రోజైన చేనేత వస్త్రాలను ధరించాలని అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం సూచించింది. దేశంలో వ్యవ సాయ రంగం తర్వాత అత్యధిక జనా­భాకు ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆన్‌లైన్‌ మార్కెటింగ్, ఆప్కో షోరూమ్‌లతో పాటు వస్త్ర ప్రదర్శనలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top