‘విత్తనం’పై నీలి నీడలు | Government has incurred dues to AP Seeds across the state | Sakshi
Sakshi News home page

‘విత్తనం’పై నీలి నీడలు

Mar 13 2025 5:56 AM | Updated on Mar 13 2025 5:56 AM

Government has incurred dues to AP Seeds across the state

రాష్ట్రవ్యాప్తంగా ఏపీ సీడ్స్‌కు రూ.261.09 కోట్లు బకాయి పడ్డ సర్కారు

అనంతపురం అగ్రికల్చర్‌:  కూటమి ప్రభు­త్వం ఇప్పుడు రైతులకు నాణ్యమైన విత్తనా­లూ అందకుండా ఏకంగా రాష్ట్ర విత్తనా­భివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్‌)నే నిర్వీర్యం చేసే దిశగా సాగుతోంది. ఈ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడమే కాకుండా, ఇచ్చిన నిధులనూ వాడుకోకుండా సంస్థకు చెందిన బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్‌ చేసేసినట్లు సమాచారం. కనీసం రైతులు చెల్లించిన నాన్‌ సబ్సిడీ సొమ్ము కూడా పూర్తిస్థాయిలో అందకుండా చేసినట్లు తెలుస్తోంది. రోజురోజుకు ఏపీ సీ­డ్స్‌ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని అధికా­రవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా­యి.

అలా ఇచ్చి.. ఇలా లాగేసుకుంటోంది..
గతేడాది (2024–25) ఖరీఫ్, రబీ సీజన్లలో ఏపీ సీడ్స్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 7,79,245 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు రాయితీతో పంపిణీ చేశారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.261.09 కోట్లు బకాయి పడింది. ఇటీవల అందులో రూ.100 కోట్లు ఏపీ సీడ్స్‌ పీడీ అకౌంట్‌కు జమ చేస్తున్నట్లు జీవో ఇచ్చారు. సొమ్ము డ్రా చేసేలోపే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్‌ను ఫ్రీజ్‌ చేసినట్లు చెబుతున్నారు. 

ఇదే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ సీడ్స్‌ జిల్లా అకౌంట్లు కూడా ఫ్రీజ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల నిధులు ఇస్తున్నట్లు బయట చెప్పుకోవడానికి తప్ప ఏపీ సీడ్స్‌కు పైసా అందడంలేదు. గతంలో అంటే 2018–19లో అప్పటి చంద్రబాబు సర్కారు దిగిపోయే సమయంలో కూడా రాయితీ విత్తనాల పంపిణీకి సంబంధించి ఏపీ సీడ్స్‌కు రూ.171.99 కోట్లు బకాయి పెట్టి వెళ్లిపోయింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement