breaking news
AP Seeds
-
‘విత్తనం’పై నీలి నీడలు
అనంతపురం అగ్రికల్చర్: కూటమి ప్రభుత్వం ఇప్పుడు రైతులకు నాణ్యమైన విత్తనాలూ అందకుండా ఏకంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)నే నిర్వీర్యం చేసే దిశగా సాగుతోంది. ఈ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడమే కాకుండా, ఇచ్చిన నిధులనూ వాడుకోకుండా సంస్థకు చెందిన బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేసేసినట్లు సమాచారం. కనీసం రైతులు చెల్లించిన నాన్ సబ్సిడీ సొమ్ము కూడా పూర్తిస్థాయిలో అందకుండా చేసినట్లు తెలుస్తోంది. రోజురోజుకు ఏపీ సీడ్స్ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.అలా ఇచ్చి.. ఇలా లాగేసుకుంటోంది..గతేడాది (2024–25) ఖరీఫ్, రబీ సీజన్లలో ఏపీ సీడ్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 7,79,245 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు రాయితీతో పంపిణీ చేశారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.261.09 కోట్లు బకాయి పడింది. ఇటీవల అందులో రూ.100 కోట్లు ఏపీ సీడ్స్ పీడీ అకౌంట్‌కు జమ చేస్తున్నట్లు జీవో ఇచ్చారు. సొమ్ము డ్రా చేసేలోపే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్‌ను ఫ్రీజ్ చేసినట్లు చెబుతున్నారు. ఇదే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ సీడ్స్ జిల్లా అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల నిధులు ఇస్తున్నట్లు బయట చెప్పుకోవడానికి తప్ప ఏపీ సీడ్స్‌కు పైసా అందడంలేదు. గతంలో అంటే 2018–19లో అప్పటి చంద్రబాబు సర్కారు దిగిపోయే సమయంలో కూడా రాయితీ విత్తనాల పంపిణీకి సంబంధించి ఏపీ సీడ్స్‌కు రూ.171.99 కోట్లు బకాయి పెట్టి వెళ్లిపోయింది. -
రూ.46 కోట్లతో వైఎస్సార్ విత్తన పరిశోధన కేంద్రం
సాక్షి,గన్నవరం: రాష్ట్రంలో మొదటిసారిగా రూ.46 కోట్లు వ్యయంతో కృష్ణాజిల్లా గన్నవరంలోని ఏపీ సీడ్స్ కార్పొరేషన్ సంస్థ ఆవరణలో నిర్మిస్తున్న వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రం పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, సింహాద్రి రమేష్‌బాబు ముఖ్య అతిథులుగా పాల్గొని భూమిపూజ చేసి పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ ఇప్పటివరకు విత్తన పరిశోధన కేంద్రం జాతీయస్థాయిలో వారణాసిలో మాత్రమే ఉందన్నారు. తొలిసారిగా రాష్ట్రంలో విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించడం రైతుల సంక్షేమం పట్ల ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఎనిమిదెకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ కేంద్రాన్ని ఏడాదిలోపు పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. మంత్రి రోజా మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన, అన్ని వాతావరణాలను తట్టకుని మంచి దిగుబడులిచ్చే విత్తనాలను సరఫరా చేసే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ శేఖర్‌బాబు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవిరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ జె.రాఘవరావు, ఏఎంసీ చైర్మన్ రామిశెట్టి అంజనీకుమారి, ఎంపీపీ అనగాని రవి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ సీడ్స్‌కు గవర్నెన్స్ నౌ అవార్డు: సీఎం జగన్ అభినందన
అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ(ఏపీ సీడ్స్)ను జాతాయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఏపీ సీడ్స్.. గవర్నెన్స్ నౌ అవార్డు గెలుచుకోవడంపై అధికారులను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయస్ధాయి సమావేశంలో సుప్రింకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా చేతుల మీదుగా ఏపీ సీడ్స్ ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, చైర్పర్సన్ పేర్నాటి సుశ్మిత ఈ అవార్డును అందుకున్నారు. అయితే మంగళవారం.. సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి, రాష్ట్రానికి వచ్చిన అవార్డును వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ది సంస్ధ వీసీ అండ్ ఎండీ డాక్టర్. గెడ్డం శేఖర్ బాబులు చూపించారు. దీనిపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అధికారులను సీఎం జగన్ అభినందించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ రంగ సంస్థలకు ‘గవర్నెన్స్ నౌ’ అంతర్జాతీయ సంస్థ గత తొమ్మిదేళ్లుగా ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఏడాది పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ (పీఎస్‌యూ–ప్రభుత్వరంగ సంస్ధలు) యూనిట్స్ కేటగిరిలో ఏపీ సీడ్స్‌కు రెండోసారి గవర్నెన్స్ నౌ అవార్డును ప్రకటించింది.