‘మహిళలను లక్షాధికారిగా చూడాలన్నదే జగనన్న  ప్రభుత్వ లక్ష్యం’ 

Government Chief Whip Gadikota Srikanth Reddy Distribute YSR Cheyutha - Sakshi

సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకే వైఎస్సార్ చేయూత అందజేత

లక్కిరెడ్డిపల్లె లో జరిగిన రెండవ విడత  వైఎస్ఆర్ చేయూత  

ప్రారంభ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి

లక్కిరెడ్డిపల్లె : మహిళలను లక్షాధికారిగా చూడాలన్నదే  జగనన్న ప్రభుత్వ లక్ష్యమని  ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  మంగళవారం లక్కిరెడ్డిపల్లె మండలంలో  రెండవ విడత వై ఎస్ ఆర్  చేయూత  ప్రారంభ కార్య క్రమాన్ని  ఎం.ఎల్.సి జకియా ఖానం,మాజీ జెడ్పిటిసి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపిపి రెడ్డేయ్య ,తదితరులుతో  కలసి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా దేశంలోనే ఏ రాష్ట్రము లోను కూడా అమలు చేయలేని విధంగా మన రాష్ట్రములో  ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ,  సీఎం జగన్ సంక్షేమ క్యాలెండర్ ను ఏర్పాటు చేసి , ఏ పథకాన్నైనా నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నారన్నారు.

మహిళలకు మహిళా పోలీసు  స్టేషన్ లు ఏర్పాటు చేయడంతో పాటు,దిశ చట్టం ఏర్పాటు  చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలును సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి చెందుతూ పైకి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లును కల్పించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు.  రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తుంటే చంద్రబాబు, లోకేష్ లు పనికిమాలిన విమర్శలు చేస్తున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 45 సంవత్సరాల పై బడిన వారికి ఇస్తానన్న పెంచన్ బదులు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.18 వేల 5 వందలు నేరుగా మహిళల ఖాతాలల్లో జమ చేయడం జరుగుతోందన్నారు.

 జగనన్నకు జేజేలు...

ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమ జీవితాలలో సీఎం జగనన్న    వెలుగులు నింపుతున్నారని మండలంలోని పలు గ్రామాల   అక్క చెల్లెమ్మలు తెలిపారు.  మీ మేలు మరువలేము  జగనన్న అంటూ జై జగన్, జై శ్రీకాంతన్న అంటూ పెద్ద ఎత్తున జేజేలు పలికారు.

మెగా చెక్కు అందచేత...
లక్కిరెడ్డిపల్లె  మండలంలోని  1497 మంది లబ్ధిదారులకు   రూ.265.875 లక్షల  మెగా చెక్కును లబ్దిదారులకు  ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎం ఎల్ సి జకియా ఖానం,మాజీ జెడ్పిటిసి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి,మాజీ ఎంపిపి రెడ్డెయ్య లు అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపిడివో విజయ్ రాఘవ రెడ్డి, ఏ.పి.ఎం శ్రీనివాసులు రెడ్డి, సింగిల్ విండో మాజి ప్రెసిడెంట్ యర్రంరెడ్డి, వైఎస్ఆర్ సిపి నాయకులు, మహిళలు,వెలుగు కార్యాలయ   సిబ్బంది,  తదితరులు పాల్గొన్నారు.

చదవండి: ప్రతిపక్షం ఇష్టానుసారంగా మాట్లాడుతోంది: శ్రీకాంత్‌రెడ్డి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top