తప్పుడు వార్తలు రాసేవారిపై పరువు నష్టం దావా వేస్తాం | Gopala Krishna Dwivedi Comments On Visakha Bauxite Mining | Sakshi
Sakshi News home page

తప్పుడు వార్తలు రాసేవారిపై పరువు నష్టం దావా వేస్తాం

Jul 5 2021 5:04 PM | Updated on Jul 5 2021 5:54 PM

Gopala Krishna Dwivedi Comments On Visakha Bauxite Mining - Sakshi

సాక్షి, అమరావతి : విశాఖ జిల్లాలో బాక్సైట్‌ మైనింగ్‌కు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని పంచాయతీరాజ్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 2010 నుంచి 2014 వరకు లేటరైట్‌కు ఆరు లీజులిచ్చారని, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ 5 మెట్రిక్‌ టన్నుల మైనింగ్‌ చేస్తే రూ.15వేల కోట్ల స్కామ్‌ ఎలా జరుగుతుంది?. తప్పుడు వార్తలు రాస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. తప్పుడు వార్తలు రాసేవారిపై పరువు నష్టం దావా వేస్తాం. జగనన్న కాలనీలకు ఎక్కడా ఇసుక కొరత లేదు. రోజూ 2లక్షల టన్నుల ఇసుక ఉత్పత్తి చేస్తున్నాం. 40 కి.మీ.లోపల ఉన్నవారు ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు’’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement