శ్రీవారికి కానుకగా బంగారు శఠారి

Golden Sathari Donated To Lord Venkateswara In Tirumala - Sakshi

సాక్షి, తిరుమల : కలియుగ వైకుంఠదైవం వెంకేటేశ్వరస్వామికి ఓ భక్తులు బంగారు శఠారి బహుమతిగా అందించారు. చెన్నైకి చెందిన భాష్యం కన్‌స్ట్రక్షన్స్ సంస్థ తరపున టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కృష్ణమూర్తి వైద్యనాథన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారికి రూ.35.89 లక్షల విలువైన బంగారు శఠారిని కానుకగా సమర్పించారు. ఈ మేరకు ఈ కానుకను శ్రీవారి ఆలయంలో టీటీడీ ఏఈఓ ధర్మారెడ్డికి  అందజేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కూడా పాల్గొన్నారు. శ్రీవారి ఉత్సవాల ఊరేగింపు సందర్భంలో ఈ శఠారిని వినియోగించనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top