 
													సాక్షి, నెల్లూరు జిల్లా: గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని జనరల్ వార్డులో ఈ ఘటన జరిగింది. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత లోపం బయటపడింది. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
					
					
					
					
						
					          			
						
				
 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
