రీల్స్ చేస్తూ ఐదవ అంతస్తు నుంచి పడి బాలిక మృతి | Girl dies after falling from fifth floor while doing reels in Social Media | Sakshi
Sakshi News home page

రీల్స్ చేస్తూ ఐదవ అంతస్తు నుంచి పడి బాలిక మృతి

Mar 30 2026 11:30 PM | Updated on Mar 30 2026 11:37 PM

Girl dies after falling from fifth floor while doing reels in Social Media

సాక్షి, తిరుపతి: తిరుపతిలోని రాజారెడ్డి నగర్‌లోని సాయి నివాస్ అపార్ట్‌మెంట్‌లో దుర్ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరిస్తూ ఐదవ అంతస్తు నుంచి కింద పడిపోయి పుష్ప (13) అనే బాలిక మృతి చెందింది. పుష్ప తండ్రి ధను బహదూర్ నేపాల్‌కు చెందినవారు. జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి తిరుపతికి వలస వచ్చారు. సాయి నివాస్ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. ఈరోజు సాయంత్రం పుష్ప రీల్స్ వీడియోలు తీస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది.  

తల్లి కాజల్ పుష్పను వెతుకుతుండగా అపార్ట్‌మెంట్ ఐదవ అంతస్తు నుంచి పడినట్లు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న అలిపిరి పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా మోజు చిన్నారుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement