రెండు మల్టీనేషనల్‌ కంపెనీల్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థినికి ఉద్యోగం

Ganapavaram Government College Student Get Job In Multinational Companies - Sakshi

గణపవరం(పశ్చిమగోదావరి): గ్రామీణ నేపథ్యం కలిగిన గణపవరం చింతలపాటి మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థిని రెండు బహుళజాతి కంపెనీల క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు హాజరై రెండు కంపెనీల్లో ఉద్యోగం సాధించింది. ప్రిన్సిపల్‌ శ్యాంబాబు తెలిపిన వివరాల ప్రకారం డిగ్రీ కాలేజీలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న బాలం రుచితాదేవి ఇటీవల బహుళజాతి సంస్థలు నిర్వహించిన ఆన్‌లైన్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు హాజరైంది, నాలుగు రౌండ్లలో జరిగిన రాత, ముఖాముఖి పరీక్షలలో విజయం సాధించి యాస్సెంచర్, క్యాప్‌జెమిని సంస్థలలో ఏడాదికి దాదాపు రూ.3.50 లక్షల వేతనంతో ఉద్యోగం సాధించింది.

చదవండి: చీఫ్‌ విప్‌ ప్రసాదరాజుకు ఎమ్మెల్యే కొఠారి సత్కారం 

ఈ విద్యార్థిని రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ తమ కళాశాలలో ఇచ్చిన శిక్షణ పొందినట్లు ఆయన తెలిపారు. విద్యార్థిని రుచితను కాలేజి అభివృద్ది కమిటి అధ్యక్షుడు కాకర్ల శ్రీనివాసరావు, వైస్‌ ప్రిన్సిపల్‌ మధురాజు, న్యాక్‌ కోఆర్డినేటర్‌ అక్కిరాజు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అఫీసర్‌ డివివి చినసత్యనారాయణ, రసాయనశాస్త్ర అధ్యాపకులు శ్రీనివాసరావు తదితరులు అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top