వాడవాడలా వేడుక | Gadapa Gadapaki Mana Prabhutvam as success all over Andhra | Sakshi
Sakshi News home page

వాడవాడలా వేడుక

Jun 8 2022 5:02 AM | Updated on Jun 8 2022 5:03 AM

Gadapa Gadapaki Mana Prabhutvam as success all over Andhra - Sakshi

గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రజలతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

సాక్షి, నెట్‌వర్క్‌: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని జిల్లాల్లో మంగళవారం ఈ కార్యక్రమం సాగింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.

ఏమైనా సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే అక్కడికక్కడే వాటిని పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement