విద్యపై ఏపీ ప్రభుత్వం కృషి అభినందనీయం 

Former MP of Germany Gujjula Ravindra Praises AP Govt - Sakshi

విద్యపై ఎంత ఖర్చుపెట్టినా నష్టం ఉండదు 

జర్మనీ దేశ మాజీ ఎంపీ, మాజీ మేయర్‌ డాక్టర్‌ గుజ్జుల రవీంద్ర 

దాచేపల్లి: విద్యాభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం చేస్తోన్న కృషి అభినందనీయమని జర్మనీలోని బ్రాండెన్‌బర్గ్‌ మాజీ ఎంపీ, అట్‌ల్యాండ్స్‌బగ్‌ మాజీ మేయర్‌ డాక్టర్‌ గుజ్జుల రవీంద్ర అన్నారు. పల్నాడు జిల్లా నడికుడి మాజీ సర్పంచ్‌ బుర్రి విజయ్‌కుమార్‌రెడ్డి నివాసంలో రవీంద్ర దంపతులను గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆదివారం కలిసి సన్మానించారు. అనంతరం విలేకరుల సమావేశంలో రవీంద్ర మాట్లాడారు.

విద్యపై ఎంత ఖర్చు పెట్టినా ఎప్పటికీ వృథా కాదన్నారు. ఇప్పటికిప్పుడు ఫలితాలు రాకపోయినా రానున్న రోజుల్లో వచ్చే ఫలాలను ప్రజలు అనుభవిస్తారని చెప్పారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. పుట్టిపెరిగిన ఊరితోపాటుగా ఉమ్మడి ఏపీలో తమవంతు సామాజిక సేవ, విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో తమ ట్రస్ట్‌ ద్వారా అంగన్‌వాడీ అనే ప్రాజెక్ట్‌ను చేపట్టామని, ఏపీలో కూడా ఇటువంటి ప్రాజెక్ట్‌లు చేపడతామని వెల్లడించారు. రవీంద్ర సతీమణి, అట్‌ల్యాండ్స్‌బగ్‌ డిప్యూటీ మేయర్‌ గాబ్రియేల్‌ మాట్లాడుతూ..దేశంలోని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించటం అభినందనీయమన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top