Flexes On Chandrababu Naidu Corruption And Fraud In Amaravati - Sakshi
Sakshi News home page

చంద్రబాబూ సిగ్గు.. సిగ్గు 

Apr 25 2023 8:18 AM | Updated on Apr 25 2023 9:01 AM

Flexes On Chandrababu Corruption And Fraud In Amaravati - Sakshi

పెదకూరపాడు : అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కెదురైంది. చంద్రబాబు మంగళశారం పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో సభ నిర్వహించనున్నారు. ఆయన రాకను నిరసిస్తూ అమరావతి ప్రజలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆయన పాలనలో అవినీతిని, గతంలో ఇచ్చిన హామీలను, చేసిన మోసాలను ప్రస్తావిస్తూ సిగ్గు.. సిగ్గు.. అంటూ అమరావతి పట్టణం మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు. 

టదళితులుగా పుట్టడం తప్పా.. చెప్పండి చంద్రబాబు, లోకేశ్‌బాబు.. మా జగనన్న సంక్షేమ పాల­న­లో మేం దళితులుగా పుట్టినందుకు గర్విస్తున్నాం 
రుణమాఫీ పేరుతో రైతుల గొంతు కోసిన నీ ప్రభుత్వం ఎక్కడ? పెట్టుబడి సాయం, పంట బీమాతో రైతు భరోసా కేంద్రాలతో రైతులకు అండగా నిలుస్తున్న జగనన్న పాలన ఇక్కడ 600 హామీలతో అందుబాటులో లేని నీ మేనిఫెస్టో ఎక్కడ? నవరత్నాలతో 98 శాతం హామీలను అమలు చేసిన మా జగనన్న మేనిఫెస్టో  ఇక్కడ... డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఆడబిడ్డలను లక్షాధికారులను చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పి వారిని నిట్టనిలువునా ముంచిన నీ ప్రభుత్వం ఎక్కడ?

ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళాభ్యుదయానికై సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, వంటి పథకాలను అమలుచేస్తున్న మా జగనన్న ప్రభుత్వం ఇక్కడ... అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  విద్యార్థులకు సాయం, డ్వాక్రా మహిళలకు అందుతున్న∙చేయూత, రైతులు, వ్యాపారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు చంద్రబాబు పాలనలో జరిగిన మోసం, సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో కలుగుతున్న లబ్ధిని వివరిస్తూ కూడా భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. వాస్తవాలను చాటు­తూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను చూసి గత ప్రభుత్వంలో జరిగిన నష్టం, ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటుపై టీడీపీ కార్యకర్తలు అమరావతిలో ధర్నా చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement