అచ్యుతాపురం సెజ్‌లోనీ పరిశ్రమలో ప్రమాదం

Fire Accident At Ajit Ferro Alloys Company Atchutapuram SEZ - Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని అచ్యుతాపురం సెజ్‌లోనీ పరిశ్రమలో మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. అభిజిత్ ఫెరో ఎల్లాయిస్ కంపెనీలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కార్మికులు పరుగులు తీయడంతో పలువురు గాయపడ్డారు. 

ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడినట్లు సమాచారం. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ ట్యాంకర్ పైప్ లైన్ లీకేజీ కారణంగా ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రమాదం జరిగినప్పటికీ విషయాన్ని పరిశ్రమ యాజమాన్యం గోప్యంగా ఉంచడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top