రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం: కన్నబాబు 

Farmers Well Being Is AP Government Goal Says Minister Kannababu - Sakshi

సాక్షి, కాకినాడ: రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం సున్నా వడ్డీ పంట రుణాలు ఇస్తున్నామని, టీడీపీ హయాంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు ఎగ్గొట్టారని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రూ.1,200 కోట్ల బకాయిలు కూడా రైతులకు చెల్లిస్తున్నాం. 2019 నిమిత్తం సున్నా వడ్డీ కింద రూ.510 కోట్లు చెల్లిస్తున్నాం. నవంబర్ 17న సీఎం చేతుల మీదుగా సున్నా వడ్డీ రుణాలు.. అక్టోబర్‌ నెలకు సంబంధించిన పంట నష్టంపై ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.109 కోట్లు అందిస్తాం.. వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, మినుము పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ.. ఉద్యాన పంటల నష్టపరిహారంగా రూ.23.46 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తాం. ( ‘సూపర్‌..’ స్పెషాలిటీ వైద్యం )

రైతుల అకౌంట్లలో నేరుగా డబ్బు జమ చేస్తాం. సీఎం జగన్ రైతు పక్షపాతి కాబట్టి టీడీపీ పెట్టిన బకాయిలు కూడా ఇస్తున్నారు. ఏ ప్రభుత్వం కూడా ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇన్‌టైమ్‌లో ఇచ్చిన పరిస్థితి లేదు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా ప్రకటిస్తున్నాం. ఏ రంగంలో చూసినా బాబు గారి బాకీలే కనపడుతున్నాయి. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న మనసున్న ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్’’ అంటూ కొనియాడారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top