
ఎన్టీఆర్‌జిల్లా,సాక్షి: ధాన్యం కొనుగోళ్లను పరిశీలించేందుకు వచ్చిన ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar)కు ఎన్టీఆర్ జిల్లా రైతులు షాకిచ్చారు.
జిల్లాలోని గొల్లపూడి మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోళ్లని పరిశీలించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ వచ్చారు. మంత్రి రాకపై సమాచారం అందుకున్న రైతులు మార్కెట్ యార్డ్‌కు చేరుకున్నారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని మంత్రి మనోహర్‌ని నిలదీశారు. మిల్లర్లు తమను దోచుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజులైనా డబ్బులు పడలేదని ప్రశ్నించారు.