గుర్తుకొస్తున్నాయి...! | Farmers Concern in Andhra pradesh | Sakshi
Sakshi News home page

గుర్తుకొస్తున్నాయి...!

Jun 28 2024 5:30 AM | Updated on Jun 28 2024 5:30 AM

Farmers Concern in Andhra pradesh

2019కి ముందు పరిస్థితులను తలచుకుంటూ రైతన్నల ఆందోళన

జగనన్న ప్రభుత్వంలో ఏటా ఖరీఫ్‌ ప్రారంభంలో రైతు భరోసా అందించి ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పింది. ఇంతవరకూ ఆ హామీకి అతీగతీ లేదు. వ్యవసాయానికి ఇదే అదును. ఈ సమయంలో చేతిలో సొమ్ములేక అప్పులు చేయల్సివస్తోంది. మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి.    – మిడితాన కన్నంనాయుడు, బాసూరు గ్రామం, పాలకొండ మండలం, పార్వతీపురం మన్యం

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారు. రైతు భరోసా పథకం రైతులకు ఎంతో చేదోడుగా నిలిచింది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అమలు చేయని రైతు భరోసా పథకాన్ని తెచ్చి అండగా నిలిచారు. పెట్టుబడుల కోసం కూటమి ప్రభుత్వం డబ్బులు ఎప్పుడిస్తుందో అంతుబట్టడం లేదు.  –పోల్నాటి శ్రీనివాసరావు, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా

వైఎస్‌ జగన్‌ క్రమం తప్పకుండా సాయం అందించి రైతులను ఆదుకు­న్నారు. ప్రభుత్వం మారాక ఇంతవరకు రైతు భరోసా పడలేదు. పెట్టుబడుల కోసం ఏం చేయాలో తోచడం లేదు. – పిప్పళ్ల వెంకటేశ్వరరావు, రైతు, పోతేపల్లి గ్రామం, బందరు మండలం, కృష్ణాజిల్లా

గత ప్రభుత్వం ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే మే నెలలో రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు. కొత్త ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. జూన్‌ ముగుస్తోంది. తక్షణం సాయం అందిస్తే బాగుంటుంది. –తోక కృష్ణ, రైతు, వెల్దుర్తిపాడు, పెనుగంచిప్రోలు మండలం

ఖరీఫ్‌ ప్రారంభమై దాదాపు నెల కావస్తున్నా ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందలేదు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి దిగులు లేకుండా సాగు చేసుకున్నాం. ఇప్పుడు సాగు ఖర్చుల కోసం అప్పులు చేయక తప్పడం లేదు. – సుంకుగారి భాస్కర్‌రెడ్డి, గోపాయపల్లె గ్రామం, రాజుపాలెం మండలం. వైఎస్సార్‌జిల్లా.

వర్షాలు కురుస్తు­న్నాయి. ఆరుద్ర కార్తె కూడా వచ్చింది. పంటల సాగుకు ఇదే మంచి అదును. గత ప్రభుత్వంలో రైతు భరోసా ఠంఛనుగా అందేది. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రెండు వారాలు దాటినా రైతుభరోసా ఊసే ఎత్తడం లేదు. జగన్‌ మళ్లీ సీఎం అయి ఉంటే మాకు ఈ బాధలు ఉండేవి కావు. –  కృష్ణారెడ్డి, రైతు, హస్తవరం, రాజంపేట మండలం, అన్నమయ్య జిల్లా

గత ప్రభుత్వంలో ఏ సీజన్‌కు ఆ సీజన్‌లో రైతు భరోసా డబ్బులు మా బ్యాంక్‌ అకౌంట్లలో జమ అయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత కేంద్రం నుంచి పీఎం కిసాన్‌ పథకం కింద రూ.2 వేలు మాత్రమే జమ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాలేదు. – రంగయ్య, రైతు, కమ్మవారిపల్లె, నంద్యాల జిల్లా    

గత ప్రభుత్వంలో ఈ సమయానికి  రైతు భరోసా అందించేవారు. ఆ సొమ్ము వ్యవసాయ పనులకు ఎంతో ఉపయోగపడింది. టీడీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయం రూ.20 వేలుకు పెంచినట్లు చెప్పినా ఇంతవరకు ఇవ్వలేదు. వ్యవసాయ పనుల సీజన్‌లో అందిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. – శ్రీకాంత్‌రెడ్డి, రైతు, పి.జలాలపురం, శింగనమల మండలం, అనంతపురం జిల్లా

వరి సాగు చేస్తా. గత ప్రభుత్వం రైతు భరోసాతో ఆదుకోవడంతో పెట్టుబడి కష్టాలు తొలగిపోయాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు సాయం అందలేదు. దీంతో మళ్లీ 2019 మునుపు పరిస్థితులు వస్తాయని భయంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు పెట్టుబడి సాయంతో ఆదుకోవాలి. లేదంటే ఈ ఏడాది సాగుకు దూరం కాక తప్పదు.– గుల్లేలు నారాయణరావు, మర్రిపుట్టు గ్రామం, గుల్లేలు పంచాయతీ, పాడేరు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా

ఏటా మే నెలలో రైతు భరోసా డబ్బులు మా ఖాతాల్లో పడేవి. ఈ ఏడాది జూన్‌ వెళ్లిపోతున్నా ఇంకా అందలేదు. వర్షాలు పడుతున్నాయి. పెట్టు­బడి సాయం ఇంతవరకూ అందలేదు.  –పెచ్చెట్టి సుబ్బారావు, కౌలు రైతు, జిన్నూరు, పోడూరు మండలం, పశ్చిమగోదావరి జిల్లా

ఏటా 5 ఎకరాల్లో వేరుశనగ సాగు చేసేవాడిని. గత ప్రభుత్వం మే నెలలోనే రైతు భరోసా కింద రూ.5,500 ఖాతాల్లో జమ చేసేది. ఖరీఫ్‌ పెట్టుబడికి ఆ డబ్బులు ఉపయోగపడేవి. ఇప్పుడు ఇంతవరకు ఆ ఊసే లేదు. సకాలంలో రైతుకు సాయం అందకపోతే చాలా ఇబ్బందులు పడతారు. – వి. హరినాథరెడ్డి, రైతు, చెరువుమరవపల్లి, తలుపుల మండలం, శ్రీసత్యసాయి జిల్లా

వరి, చెరకు సాగు చేస్తున్నా. జగన్‌ సీఎంగా ఉన్న కాలంలో సీజన్‌లో పెట్టుబడులకు సాయం అందించారు. రూ.20 వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎప్పుడు ఇస్తారో మాత్రం చెప్పడం లేదు. సకాలంలో అందించి రైతులను ఆదుకోవాలి. 
– కాండ్రేగుల కిరణ్‌కుమార్, రైతు, చూచుకొండ, మునగపాక, అనకాపల్లి జిల్లా

గతంలో రైతు భరోసా క్రమం తప్పకుండా అందింది. ఈ ఏడాది జూలై వస్తున్నా పెట్టుబడి సాయం అందక పోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉంది. – చిన్నభగవంతప్ప,  రైతు, ఆరేకల్, ఆదోని మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement