కడప జిల్లా: వ్యవసాయ కూలీల ఖర్చు భరించలేక ఒక రైతు శుక్రవారం తన కుమారుడు, కుమారైలకు కాడికట్టి కాడెద్దులుగా చేశాడు. పెండ్లిమర్రి మండలం మమ్ముసిద్దుపల్లె గ్రామానికి చెందిన బండి చంద్రశేఖర్‌రెడ్డి అనే రైతు తన పొలంలో ఒక ఎకరాలో పూల సాగు చేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు కలుపు ఎక్కువగా ఉండటంతో దానిని తీసేందుకు కూలీలు దొరకక, దూరం నుంచి కూలీలను పిలిపిస్తే ఖర్చు ఎక్కువ అవుతుందని ఇంటర్ చదువుతున్న తన పిల్లలు ప్రహ్లాదరెడ్డి, చామంతిలకు కాడి కట్టి కలుపు తొలగిస్తున్నారు.


