నీట్‌లో మెరిసిన రైతుబిడ్డలు

Farmer daughters showed talent in NEET PG results - Sakshi

కర్నూలు: నీట్‌ పీజీ ఫలితాల్లో రైతు బిడ్డలు ప్రతిభ చూపారు. మంగళవారం సాయంత్రం వచ్చిన ఫలితాల్లో ఆల్‌ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించారు. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన చెన్నూరు హుసేని, చెన్నూరు హుసేనమ్మలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

వీరి రెండో కుమార్తె రజియా అనంతపురం  ప్రభుత్వ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి పీజీ చేయాలన్న సంకల్పంతో నీట్‌ పరీక్షలు రాయగా 571 మార్కులు వచ్చాయి. ఆలిండియా స్థాయిలో 5248వ ర్యాంకు వచ్చింది. చిన్నపిల్లల వైద్యనిపుణురాలిగా మంచి పేరు తెచ్చుకుని పేదలకు సేవచేయాలన్నదే తన లక్ష్యమని ఈమె తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top