విశాఖ ఆకస్మిక సర్వే.. ఓ తప్పుడు కథనం.. ఇదిగో వాస్తవం

Fack Check News: Eenadu Misleading On Vizag Forest land Survey - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ అధికార పార్టీ తీరును, నేతలను బద్నాం చేసేలా యెల్లో మీడియా వరుసగా అసత్య కథనాలతో వక్రబుద్ధి ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా విశాఖ అటవీ భూముల్లో ఆకస్మిక సర్వే పేరుతో ఓ కథనం ప్రచురించింది ఈనాడు. అయితే.. సదరు కథనం పూర్తిగా అవాస్తవమని జిల్లా కలెక్టర్‌ పేరు మీద ఒక ప్రకటన విడుదల అయ్యింది. 

సదరు సర్వే.. అదొక సాధారణ స్పందన అర్జీలో భాగమని ప్రకటించారు. నవంబర్‌ 26వ తేదీన ఈ సర్వే జరిగిందని, ఇందుకుగానూ నోటీసులు 12 రోజుల ముందే అందించామని అధికారులు తెలిపారు. దరఖాస్తుదారు, డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారికి నోటీసులు అందించి.. నోటీసుల ప్రకారం ఈ తేదీనే TS.NO:88/B1, B2, B3 భూమిని సర్వే చేసినట్లు వెల్లడించారు.  

శీరంవహిత ఫర్మా ఒక రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ను జత చేసి సర్వే చేయాలని స్పందన ద్వారా దరఖాస్తు పెట్టుకున్నారని అధికారులు వెల్లడించారు.  అంతేగానీ.. కడప ప్రాంతానికి చెందిన నేత ప్రమేయం ఉందంటూ ఈనాడులో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం తరపున ఒక ప్రకటన వెలువడింది.

ఇదీ చదవండి: ‘రాజధాని అంటే జేబులు నింపుకోవడం కాదు’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top