
సాక్షి, అమరావతి: ఎయిడ్స్ వ్యాప్తిని 2030 నాటికి సున్నా శాతానికి తగ్గించటమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీశాక్స్) పీడీ డాక్టర్ ఎ. సిరి తెలిపారు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా శాక్స్ ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం 5కె రన్‌ను సిరి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపవద్దని కోరారు. ప్రస్తుతం 10 వేల మందికి పైగా బాధితులున్నారని తెలిపారు. 5కె రన్‌ల్లో విజేతలకు నగదు బహుమతిగా చెక్కులు, మెడల్స్, సరి్టఫికెట్లు అందజేశారు.