
ఉద్యోగులు ఏది కావాలంటే అది చేసిన ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
సాక్షి, తాడేపల్లి: ఉద్యోగులు ఏది కావాలంటే అది చేసిన ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. 2008, 2018 డీఎస్సీలను పరిష్కరించి టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చింది మన సీఎం జగన్ అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ‘ఉద్యోగులకు మేలు చేసే ముఖ్యమంత్రి మనకు ఉన్నారు. ఇంకా ద్వారాలు తెరిచే ఉన్నాయి.. చర్చలకు రండి. మీరంతా మా కుటుంబ సభ్యులు...ఎవరికీ అన్యాయం జరగదు.
ఉద్యోగులకు ప్రమోషన్స్ అనేక ఇచ్చారు. ఏది కావాలంటే అది చేసిన ప్రభుత్వం మనది. ఇంత దాకా రావాల్సిన అవసరమే లేదు...మంచి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ సమస్య అయినా మంత్రుల కమిటీ ముందు చర్చించండి. ఉద్యోగ సంఘాలకు అత్యంత గౌరవం ఇచ్చే ముఖ్యమంత్రి.. వైఎస్ జగన్. ఉద్యోగ సంఘాలు ఓట్ల గురించి కాదు.. సమస్య గురించి మాట్లాడాలి’ అని మంత్రి హితవు పలికారు.