‘ఆ ఆలయాలకు నోటీసులు జారీ చేస్తాం’

Eluru Range DIG Comments Over Mandapeta Incident - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : మండపేట టౌన్‌లో రాత్రిపూట పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహన్‌ రావు తెలిపారు. బుధవారం డీఐజీ మాట్లాడుతూ.. విగ్రహాల ధ్వంసంపై కేసు నమోదు చేసి, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో 20 మంది వరకు అనుమాతులు ఉన్నారని, సీసీ టీవీ ఫుటేజ్‌లో కొంతమందిని గుర్తించినట్లు తెలిపారు. మండపేట ప్రజలు సమన్వయంతో ఉండాలని సూచించారు. (‘చలో అంతర్వేది’కి అనుమతుల్లేవ్‌)

‘అరాచక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ప్రతి దేవాలయాల దగ్గర కమిటీలు ఏర్పాటు చేసుకుని సెక్యూరిటీ ఏర్పరుచుకోవాలి.  సీసీ కెమెరాలు, లైటింగ్  ఏర్పరుచుకుని గుడి బాధ్యతలు కమిటీ  తీసుకోవాలి. చిన్న టెంపుల్స్‌లో సైతం కమిటీలు బాధ్యత తీసుకోవాలి. కమిటీలు ఏర్పాటు చేయని ఆలయాలకు నోటీసులు జారీ చేస్తాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు పోలీసులకు సహకరించాలి’. అని ఏలూరు రేంజ్ డీఐజీ పేర్కొన్నారు. (అక్టోబర్ 2 నుంచి 'మనం-మన పరిశుభ్రత')

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top