భారీగా తగ్గిన విద్యారుణాలు

Educational Loans Greatly Reduced Due To Lockdown Effect - Sakshi

లాక్‌డౌన్, అమెరికా వీసాలపై ఆంక్షల ప్రభావం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందుతుండటంతో రుణాలపై విద్యార్థుల అనాసక్తి  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యా రుణాలు తీసుకునే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. 2018–19తో పోలిస్తే 2019–20లో విద్యారుణం తీసుకున్న వారి సంఖ్య 56 శాతం పడిపోయినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదికలో పేర్కొంది.  
అమెరికా వీసాలపై ఆంక్షలతో... 
2018–19లో 35,779 మంది రూ.796 కోట్లు విద్యా రుణం తీసుకోగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో 15,611 మంది రూ.478 కోట్లు మాత్రమే రుణం తీసుకున్నారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలోవిద్యా రుణాలు తీసుకున్న వారి సంఖ్య 1,04,597 కాగా అది ఇప్పుడు 77,983కి పడిపోయింది.  
ఆర్థిక వ్యవస్థ మందగమనం, అమెరికా వీసా నిబంధనలు కఠినతరం చేయడం విద్యారుణాలు తగ్గడానికి ప్రధానకారణంగా బ్యాంకర్లు పేర్కొంటున్నారు. మొండి బకాయిలు పెరగడం కూడా కారణంగా చెబుతున్నారు.   (ఆ అధికారం కోర్టుకు లేదు)

ఇంజనీరింగ్‌ వంటి ఉన్నతవిద్యకు తీసుకునే రుణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తిరిగి అమల్లోకి రావడంతో విద్యారుణం తీసుకునే వారి సంఖ్య మరింత తగ్గిందని ఎస్‌బీఐ మేనేజర్‌ ఒకరు వ్యాఖ్యానించారు. 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విద్యారుణాలు మరింత తగ్గుతాయని బ్యాంకింగ్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్‌19తో ఈ ఏడాది విదేశీ విద్య రుణాలు దాదాపుగా ఉండకపోవచ్చని, స్థానిక కోర్సులప్రారంభంపై స్పష్టత లేకపోవడంతో విద్యా రుణాలకు ముందుకు రావడం లేదు. 
గతేడాది ఈ సమయానికి రూ.కోటికిపైగా రుణాలు ఇచ్చామని, ఇప్పుడు అడిగే వారే కనిపించడం లేదని విజయవాడలోని ఒక రీజనల్‌ బ్యాంకు మేనేజర్‌ తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top