ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు | Ed Attaches Ed Attaches Siemens Company Assets On Money Laundering Case | Sakshi
Sakshi News home page

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు

Oct 15 2024 6:25 PM | Updated on Oct 15 2024 9:27 PM

Ed Attaches Ed Attaches Siemens Company Assets On Money Laundering Case

ఢిల్లీ: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) దూకుడు ప్రదర్శిస్తోంది. స్కిల్‌ స్కామ్‌ కేసులో సిమెన్స్ కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబై ,పూణేలలోని రూ.23 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.  

ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది.నకిలీ ఇన్ వాయిస్‌ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. స్కిల్ డెవలప్మెంట్ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు తేలింది. డీటీసీఎల్‌ ఎండీ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ ముకుల చండ్ ఆస్తులను సైతం ఈడీ స్వాధీనం చేసుకుంది.  

స్కిల్‌ కుంభకోణం కేసు..ప్రభుత్వంలో వణుకు
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో పేరుతో చంద్రబాబు తన హయాంలో రూ. 240 కోట్లను షెల్ కంపెనీలకు తరలించారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు గతంలోనే  13 చోట్ల ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు పెట్టినట్టు నిర్ధారించింది.

రూ.370 కోట్ల ప్రాజెక్టును రూ.3,300 కోట్లకు పెంచేసి గోల్మాల్ చేసిన చంద్రబాబు ఇదే కేసులో 52 రోజుల పాటు జైలు శిక్షను అనుభవించారు.  తాజాగా, ఈ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ కేసు ఆధారంగా సిమెన్స్ కంపెనీ ఆస్తులను ఈడీ అటాట్ చేసింది. దీంతో స్కిల్ కుంభకోణం కేసులో ఏపీ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఈడీ తాజా అటాచ్‌మెంట్‌తో సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు కలవరానికి గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement