టీడీపీ ఇన్‌చార్జ్ జలచౌర్యంపై కలెక్టర్ సీరియస్

‘సాక్షి’ కథనంపై స్పందించిన కలెక్టర్ గంధం చంద్రుడు
ఉమామహేశ్వరనాయుడిపై చర్యలకు రంగం సిద్ధం
సాక్షి, అనంతపురం : కళ్యాణదుర్గం టీడీపీ ఇన్‌చార్జ్ ఉమామహేశ్వర నాయుడుపై కఠిన చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఉమామహేశ్వరనాయుడు తన పొలాలకు అక్రమంగా నీటిని తరలించడంపై సమగ్ర వివరాలతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన కలెక్టర్ గంధం చంద్రుడు.. తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. (జేసీ ప్రధాన అనుచరుడు రషీద్ మృతి)
సోమవారం జీడిపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. రిజర్వాయర్ నుంచి పెద్ద ఎత్తున నీటిని తరలించడం చట్టరీత్యా నేరమని, నీటిని తరలించడానికి ఎవ్వరికీ అనుమతులు లేవన్నారు. అనంతరం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, రిజర్వాయర్ అధికారులు మాట్లాడుతూ జలచౌర్యంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. (‘చంద్రబాబు కనుసన్నల్లో ఏబీఎన్’)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి