సినిమా టికెట్‌ ధరల హేతుబద్ధీకరణపై చర్చ 

Discussion on movie ticket price rationalization - Sakshi

వర్చువల్‌గా సమావేశమైన ప్రత్యేక కమిటీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో టికెట్‌ రేట్లను హేతుబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారి శుక్రవారం వర్చువల్‌గా సమావేశమైంది. టికెట్‌ రేట్లు నిర్ణయించే క్రమంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, సినీగోయర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో కమిటీ ప్రాథమికంగా చర్చించింది.

ఈ క్రమంలో సభ్యుల సూచనలు, సలహాలను సైతం కమిటీ స్వీకరించింది. వీటిపై సమగ్రంగా చర్చించేందుకు జనవరి 11వ తేదీన మరోసారి సమావేశమవ్వాలని కమిటీ నిర్ణయించింది. ప్రేక్షకులపై భారం పడకుండా తక్కువ ధరకు వినోదాన్ని అందించేందుకు హైకోర్టు సూచనల మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించిన విషయం తెలిసిందే.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top