నిజాలు సమాధి చేయబోయి.. చివరికి తేలుకుట్టిన దొంగల్లా టీడీపీ..

Dharmavaram Kabristan TDP Politics On Restructuring - Sakshi

సాక్షి, ధర్మవరం: హిందూముస్లింల ఐక్యతకు, శాంతి, సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ధర్మవరంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అలజడులు సృష్టించాలని పన్నాగం పన్నారు. తన స్వార్థం కోసం కబరస్తాన్‌ను పావుగా వాడుకున్నారు. పట్టణంలోని మసీదు, అంజుమన్‌ కమిటీల ఆధ్వర్యంలో జరిగే అంతర్గత వ్యవహారాలను రాజకీయం చేసి ఎమ్మెల్యే కేతిరెడ్డిపై బురద జల్లాలని ప్రయత్నించారు.  

అసలేం జరిగిందంటే.. 
ధర్మవరం ఇందిరానగర్‌లో ముస్లింల కబరస్తాన్‌ ఉంది. దానికి ఆనుకునే ఎగువ భాగంలో పెద్ద డ్రైనేజీ ఉంది. దీంతో మురుగునీరు తరచూ కబరస్తాన్‌లోకి వచ్చి చేరుతుండగా, సమాధులన్నీ మునిగిపోతున్నాయి. దీనికి తోడు స్థలం తక్కువగా ఉండటంతో కబరస్తాన్‌ పూర్తిగా సమాధులతో నిండిపోయింది. దీంతో ముస్లింలు ఎవరైన చనిపోతే  ...వారి అంత్యక్రియలను పట్టణానికి 6 కి.మీ దూరంలోని ఈద్గా మైదానంలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

శాశ్వత పరిష్కారం కోసం చర్యలు.. 
కబరస్తాన్‌లో మురుగునీరు చేరకుండా చూడటంతో పాటు వసతులు కల్పించేందుకు గత అక్టోబర్‌లో.. జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు సమావేశం నిర్వహించారు. కబరస్తాన్‌ను  పునర్‌ నిర్మించాలని 40 మసీదులకు చెందిన ముతవల్లీలు ఆమోదించి తీర్మానం చేశారు. అందులో భాగంగా కబరస్తాన్‌లోని సమాధులను తొలగించి మైదానం మొత్తం 4 అడుగులకుపైగా మట్టితో ఎత్తు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. అభ్యంతరాలకు రెండు నెలల సమయం తీసుకున్నారు. అందుకు గడువు కూడా ముగియడం, ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో 3 రోజుల క్రితమే మసీదు కమిటీలు, అంజుమన్‌ కమిటీల ఆధ్వర్యంలో మత పెద్దలు, దాతల సహకారంతో పనులను ప్రారంభించారు.  

పరిటాల శ్రీరామ్‌ రంగ ప్రవేశంతో రాజకీయ రంగు 
కబరస్తాన్‌ పునరి్నర్మాణ పనులు ప్రశాంతంగా సాగిపోతుండగా... గురువారం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ వాటి గురించి తెలుసుకున్నారు. స్థానికంగా నివాసం లేని ఆయన...నిజానిజాలు తెలుసుకోకుండా కబరస్తాన్లో సమాధులను ఏక పక్షంగా తొలగిస్తున్నారని, ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్‌ చేస్తూ ఆరోపణలు చేశారు. దీనిపై ముస్లిం మత పెద్దలంతా స్పందించారు. కబరస్తాన్‌ పునర్‌ నిర్మాణ పనులన్నీ తమ ఆధ్వర్యంలో సాగుతున్నాయని, దానికి రాజకీయ రంగు పులమడం అన్యాయమన్నారు. దీన్ని రాజకీయం చేయవద్దని రాజకీయ పారీ్టల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు.   

అందరి ఆమోదంతోనే పనులు..
 ర్మవరంలోని అన్ని మసీదు కమిటీలతో చర్చించి 40 మంది ముతవల్లీల ఆమోదంతోనే కబరస్తాన్‌ పునరి్నర్మాణ పనులు చేస్తున్నాం. ఇందులో ఎలాంటి వివాదం లేదు. రాజకీయ పారీ్టల నాయకులు ఇందులో జోక్యం చేసుకోకూడదు. చిన్నపాటి లోటుపాట్లు ఉంటే మేము చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుంటాం. 
– ముస్తాక్‌ అహ్మద్, ముతవల్లి,  జామియా మసీదు, ధర్మవరం.  

రాజకీయం చేయొద్దు 
ఇస్లాం సంప్రదాయంలో కబరస్తాన్‌ల పునర్నిర్మాణం కొత్తేమీ కాదు. గతంలో అనంతపురంలోని ఈద్గాలో, బత్తలపల్లి కబరస్తాన్, హిందూపురంలోనూ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ధర్మవరంలోనూ అందరి ఆమోదంతోనే ముస్లింలతా కలసికట్టుగా దాతల సహకారంతో కబరస్తాన్‌ను పునర్నిర్మిస్తున్నాం. వీటిని రాజకీయం చేయవద్దు.          
– జాకీర్, ముతవల్లి, మదీనా మసీదు, ధర్మవరం  

ఐక్యతను దెబ్బతీయొద్దు  
కబరస్తాన్‌ పునర్‌ నిర్మాణం పవిత్ర కార్యం. ఇందులో ఏ రాజకీయ పార్టీ జోక్యం చేసుకోకూడదు. అంజుమన్‌ కమిటీ, మతపెద్దలు, మసీదు కమిటీల ఆధ్వర్యంలోనే పనులు జరుగుతున్నాయి. ప్రతి ముస్లిం ఈ పనుల్లో భాగస్వామిగా ఉంటాడు. ముస్లింల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఏ ఒక్కరూ వ్యవహరించవద్దు.             
– స్టార్‌ ఖలీల్, అంజుమన్‌ కమిటీ అధ్యక్షుడు, ధర్మవరం  

గీత దాటితే చర్యలు 
కబరస్తాన్‌ పునర్‌ నిర్మాణం సున్నితమైన అంశం. ఏ ఒక్కరూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయకూడదు. ఈ విషయంపై ఇప్పటికే ముస్లిం మత పెద్దలందరితో చర్చించాం. కబరస్తాన్‌ పునరి్నర్మాణంలో ఎవరికైనా సందేహాలుంటే మత పెద్దల ద్వారా నివృత్తి చేసుకోవాలి. చట్టపరిధి దాటి సోషల్‌ మీడియా ద్వారా అసత్యాలు ప్రచారం చేసినా, భావోద్వేగాలు రెచ్చగొడితే చర్యలు తప్పవు. 
– సుబ్రమణ్యం, వన్‌టౌన్‌ సీఐ, ధర్మవరం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top