కృష్ణా, గోదావరి జిల్లాల అభివృద్ధికి నీరే ప్రధానం: ధర్మాన ప్రసాదరావు

Dharmana Prasada Rao Speech On Vamsadhara Project Srikakulam district - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: వంశధార ప్రాజెక్ట్ కోసం ఇప్పటివరకూ సుమారు రూ.2000 కొట్లు ఖర్చు చేశామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఒడిశా రాష్ట్రంతో ఇబ్బందులు కొనసాగితున్నాయని, ట్రిబ్యునల్ తీర్పుపై ఒడిశా కోర్టుకు వెల్లనున్నట్లు సమాచారం ఉందని తెలిపారు.

ప్రాజెక్ట్ అనుభవిస్తున్న మనకు ఉన్నంత శ్రద్ద ఒడిశాకు ఉండదని అన్నారు. అభ్యంతరాలు అన్నీ పూర్తి కావాలంటే మరో ఐదేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. గొట్ట దగ్గర ఒక లిప్ట్ పెట్టి హిరమండలం ప్రాజెక్టులో 19 టీఎంసీలు నింపితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ  ఆలోచనను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన సానుకూలంగా పరిశీలిస్తున్నారని చెప్పారు.

గొట్టా వద్ద ఎత్తిపోతల పధకానికి రూ. 300 నుంచి రూ.350 కొట్లు అదనపు ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్ధ్యం నిండాలంటే ఎత్తిపోతల అవసరం ఏర్పడిందని చెప్పారు. రైతులు కమర్సియల్ క్రాప్స్ పండించాలన్నారు. కృష్ణా, గోదావరి జిల్లాలు అభివృద్ధికి నీరే ప్రధానమని, ఒడిశా తగాదా దురదృష్టకరమని పేర్కొన్నారు. వంశధార ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి కావలసిందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ హాయాంలోనే రైతులకు వంశధార ప్రాజెక్ట్ ద్వారా నీరు అందిస్తామని తెలిపారు.

వచ్చే వేసవి నాటికి 2లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రిజర్వాయర్ నీటిని నిల్వచేయడం ద్వారా నాగావళి, వంశధార అనుసంధానం చేయవచ్చని తెలిపారు. నిర్వాసితుల సమష్యల పరిస్కారించాలని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. తిత్లీ తుఫాన్, వంశధార నిర్వాసితులకు అదనపు ప్యాకేజీ త్వరలోనే సీఎం జగన్  అందజేస్తామని తెలిపారు. త్వరలోనే సీఎం వైఎస్‌ చేతుల మీదుగా కాట్రగడ్డ బ్యేరేజ్‌కు పౌండేషన్ స్టోన్ వేస్తామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top