
సాక్షి, అమరావతి: సాక్షి పత్రిక చెప్పిందే నిజమైంది. కీలకమైన విజిలెన్స్- ఎన్ ఫోర్స్‌మెంట్ విభాగాన్ని తన గుప్పిట్లోనే పెట్టుకోవాలన్న డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తన పంతం నెగ్గించుకున్నారు. తాము చెప్పినట్టుగా రెడ్‌బుక్ కుట్రను అమలు చేస్తున్న డీజీపీ గుప్తా ఒత్తిడికే చంద్రబాబు ప్రభుత్వం తలొగ్గింది. డైరెక్టర్ జన రల్ (డీజీ) స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేసింది. విజిలెన్స్-ఎన్ ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా హరీశ్ కుమార్ గుప్తాను పూర్తి అదనపు బాధ్యతలతో నియమిం చింది. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులకు సంబం దించి మూడో అతి పెద్ద పోస్టు అయిన విజ లెన్స్- ఎన్ ఫోర్స్‌మెంట్ విభాగం డీజీ పోస్టింగు వ్యవహారం కొంతకాలంగా వివాదాస్పదమవు తోంది. రెగ్యులర్ డీజీపీగా నియమితులైన తరువాత కూడా హరీశ్ గుప్తా ఆ పోస్టును కూడా తానే నిర్వహించాలని భావించారు.
అగ్నిమాపక, సీఐడీ విభాగాల పైనా 'పట్టు'
విజిలెన్స్ విభాగంతోపాటు అగ్నిమాపక, సీఐడీ విభాగాలను కూడా తనకు అనుకూలంగా ఉం డే ఐజీ స్థాయి అధికారులతో నిర్వహించాల న్నది డీజీపీ గుప్తా ఉద్దేశం. తద్వారా కీలకమైన విభాగాలన్నీ తన గుప్పిట్లోనే ఉంచుకోవాలన్న ది ఆయన లక్ష్యం. ఈ మేరకు ప్రభుత్వానికి వెలుగులోకి తెచ్చింది.
ఆ ప్రతిపాదనపై సీనియర్ ఐపీఎస్ అధికారులు కొన్ని రోజులుగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డీజీపీ గుప్తా పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నిబం ధనలకు విరుద్ధంగా డీజీపీ గుప్తాను విజిలెన్స్-ఎన్ ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా నియమించ కూడదని డిమాండ్ చేశారు. డీజీపీ గుప్తాతో కలసి కార్యక్రమాల్లో పాల్గొనేందుకూ ససేమిరా అన్నారు. డీజీపీ గుప్తాకు అనుకూలంగా వ్యవ హారాన్ని సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేసిన ప్రయత్నాలను కూడా తిప్పికొట్టారు.
ఈ నేపథ్యంలో డీజీపీ గుప్తా చురుగ్గా పావులు కదిపారు. చంద్రబాబు, మంత్రి లోకేశ్లపై తన దైన శైలిలో ఒత్తిడి తీవ్రతరం చేశారని సమాచా రం. తత్ఫలితంగానే డీజీపీ హరీశ్ కుమార్ గుప్తానే విజిలెన్స్- ఎన్ ఫోర్స్‌మెంట్ విభాగానికి పూర్తి అదనపు బాధ్యతలతో డీజీగా నియామించడం జరిగింది. తద్వారా ఆ పోస్టును ఆశించిన డీజీల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది.
ఇక అగ్నిమాపక, సీఐడీ విభాగాలు కూడా అదే రీతిలో డీజీపీ గుప్తాకు అనుకూలంగా ఉండే ఐజీ స్థాయి అధికారులకే కట్టబెడతారన్నది స్పష్టమైంది. మరి ఈ పరి ణామాలపై డీజీలు ఎలా స్పందిస్తారు..? పోలీసు శాఖలో తదుపరి పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి..? వంటి అంశాలపై ఆసక్తి నెలకొంది.