సాక్షి, అమరావతి: తాడేపల్లి, మంగళగిరిని మోడల్ పట్టణాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సమగ్రప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాడేపల్లి, మంగళగిరి పట్టణాలను రూ.1,173 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా 20 కోట్ల రూపాయలను పాలనా అనుమతి కింద మంజూరు చేస్తూ పురపాలక శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. సమగ్రప్రాజెక్టు నివేదిక రూపకల్పన బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్(ఏపీయూఐఏఎంఎల్)కు అప్పగించింది. (అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా!)
చదవండి: (షర్మిలమ్మ పాదయాత్ర చారిత్రక ఘట్టం )

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
