మిమ్మల్ని విడిచి యాడకీ పోను..!

A Deer Returned To A Family of Chinnodu Although Left The Forest - Sakshi

అడవిని వదిలి ఒకరింట్లో ఆదరణ పొందుతున్న  జింక తిరిగి వెళ్లనంటోంది. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి అటవీ ప్రాంతానికి చేరువలోని లక్కవరప్పాడులో  రెండేళ్ల క్రితం రెండు నెలల వయసున్న చుక్కల జింక దారి తప్పి వచ్చేసింది. గూనా చిన్నోడు–దేవి దంపతులు చూసి దీనిని తమ బిడ్డలా పెంచుతున్నారు.


గూనా చిన్నోడు, దేవి దంపతుల ఇంటికి వచ్చిన జింక పిల్ల ఇదే (ఫైల్‌)..

ఆ జింక ఆ కుటుంబంతోనే కాదు ఊరంతా కలియతిరుగుతూ అందరికీ చేరువైంది. ఇటీవల అటవీ అధికారులు ఈ వన్య ప్రాణిని గమనించారు. చిన్నోడు దంపతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి దానిని సమీప అడవుల్లో వదిలి వచ్చారు. అయితే ఆ జింక మర్నాడే తిరిగి వచ్చేసింది. దీంతో చిన్నోడు దంపతులు దానిని ఆనందంతో అక్కున చేర్చుకున్నారు.
–రాజవొమ్మంగి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top