తిరుమలపై ‘నివర్‌’ ప్రభావం | Cyclone Nivar Effect On Tirupati And Tirumala Devotees In Chittoor | Sakshi
Sakshi News home page

తిరుమలపై ‘నివర్‌’ ప్రభావం

Nov 25 2020 9:16 AM | Updated on Nov 25 2020 11:10 AM

Cyclone Nivar Effect On Tirupati And Tirumala Devotees In Chittoor - Sakshi

సాక్షి, తిరుపతి: నివర్ తుఫాను ప్రభావం తిరుమలపై పడింది. బుధవారం ఉదయం నుండి తిరుమలలో ఎడతెరిపి లేకుం​డా వర్షం కురుస్తుంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటు దర్శనం తర్వాత వచ్చే భక్తులు తడిసిపోతున్నారు. దీంతో భక్తుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. జలాశయాలలో వర్షం నీరు చేరుతుంది. మరోపక్క ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహన దారులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచిస్తున్నారు. ఆగకుండా కురుస్తోన్న వర్షానికి సప్తగిరులు తడిసి ముద్దవుతున్నాయి. 

వెంకన్న సేవలు పలువురు ప్రముఖులు
శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నర్సింహారావు, బీజేపీ సీనియర్‌ నేత సునీల్ దియెధర్,  రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. ఆలయం వెలుపల జీవీఎల్‌ మాట్లాడుతూ శ్రీవారి కృపతో దేశప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement