ఈ నెల 10 వరకు కర్ఫ్యూ

Curfew until 10th of June month in Andhra Pradesh - Sakshi

రాష్ట్రంలో కోవిడ్‌ కట్టడి కోసం ఆంక్షలు పొడిగింపు

విదేశాలకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగ వీసాలపై వెళ్లే వారికి టీకాలు

కేంద్రం కేటాయింపుల మేరకే బ్లాక్‌ ఫంగస్‌ ఇంజక్షన్లు

ఆక్సిజన్‌పై అప్రమత్తంగా ఉండాల్సిందే

మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు మెరుగైన వడ్డీ వచ్చేలా పథకాల్లో మదుపు

కోవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న కర్ఫ్యూను జూన్‌ 10 వరకు కొనసాగించాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆంక్షలు కట్టుదిట్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల వ్యాక్సినేషన్‌కు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగ వీసాలపై విదేశాలకు వెళ్లే వారికి కూడా టీకాలు ఇచ్చి ధృవీకరణ పత్రాలు అందేలా చూడాలన్నారు. కోవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.  

కోవిడ్‌ లేకున్నా బ్లాక్‌ ఫంగస్‌..!
బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు అందుతున్న వైద్యంపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. చికిత్సకు అవసరమైన ఇంజక్షన్లు, మాత్రలు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 1,179 నమోదు కాగా 1,068 మందికి వైద్యం అందుతోందని, 97 మందికి నయం అయిందని అధికారులు తెలిపారు. 14 మంది మరణించినట్లు వెల్లడించారు. కోవిడ్‌ సోకకున్నా బ్లాక్‌ ఫంగస్‌ వస్తుందన్న విషయం తమ పరిశీలనలో తేలిందని పేర్కొన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ వచ్చిన వారిలో 1,139 మంది కోవిడ్‌ సోకినవారు కాగా 40 మందికి కరోనా లేకున్నా బ్లాక్‌ ఫంగస్‌ వచ్చిందని తెలిపారు. డయాబెటిస్‌ ఉన్నవారికి అధికంగా వస్తోందని, కేంద్రం కేటాయింపులు ప్రకారమే ఇంజక్షన్లు వస్తున్నాయని వివరించారు. మాత్రలను అవసరమైన మేర సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంజక్షన్ల కోసం కూడా కృషి చేస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిల్వ ట్యాంకులుండాలి...
కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ సరఫరా, నిల్వలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. ఆక్సిజన్‌ వినియోగం 490 టన్నులకు తగ్గిందని అధికారులు వెల్లడించారు. మే 29వ తేదీన 654 టన్నులను సేకరించామని, స్థానికంగా 230 టన్నుల ఉత్పత్తి అయినట్లు తెలిపారు. ఆక్సిజన్‌ సేకరణ, నిల్వలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిల్వ చేసే ట్యాంకులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు.

సరైన పథకాల్లో మదుపు చేయాలి..
కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన చిన్నారుల పేరిట సరైన పథకాల్లో డబ్బు మదుపు చేయడం ద్వారా ఆర్థిక భద్రతతోపాటు ప్రతి నెలా కనీస అవసరాల కోసం మెరుగైన వడ్డీతో డబ్బులు అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 92 మంది పిల్లలను ఇప్పటివరకూ గుర్తించామని, వీరిలో 43 మందికి రూ.10 లక్షల చొప్పున డిపాజిట్‌ చేశామని అధికారులు వెల్లడించారు.

అన్ని జిల్లాల్లో కేసులు తగ్గుముఖం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించారు. ప్రతి పది లక్షల జనాభాకు పట్టణాల్లో 2632 కేసులు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 1859 కేసులు ఉన్నట్లు తెలిపారు. పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందన్నారు. మే 16న పాజిటివిట్‌ రేటు 25.56 శాతం ఉండగా 30వతేదీ నాటికి 15.91 శాతానికి తగ్గినట్లు చెప్పారు. ఒకదశలో రెండు లక్షలకుపైగా ఉన్న యాక్టివ్‌ కేసులు 1.6 లక్షలకు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. రికవరీ రేటు గణనీయంగా మెరుగుపడిందని, మే 7వతేదీన 84.32 శాతంగా ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం దాదాపు 90 శాతానికి చేరుకున్నట్లు వివరించారు. ఇక 104 కాల్‌సెంటర్‌కు మే 3వతేదీన 19,175 కాల్స్‌ రాగా 29వ తేదీన కేవలం 3,803 కాల్స్‌ మాత్రమే వచ్చాయని, కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందనేందుకు ఇది సంకేతమని పేర్కొన్నారు.

– సమీక్షలో ఉపముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జ్‌ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ మల్లిఖార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఆయుష్‌ కమిషనర్‌ వి.రాములు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

01-06-2021
Jun 01, 2021, 06:11 IST
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా నివారణకు 5 రకాల మందులు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు.   1....
01-06-2021
Jun 01, 2021, 06:04 IST
సాక్షి, అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 45 ఏళ్లు దాటిన వారిలోనే అధికంగా నమోదవుతున్నాయి. మధుమేహం ఉండి కరోనా వచ్చిన...
01-06-2021
Jun 01, 2021, 05:55 IST
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేసిన మందును సంప్రదాయ మందుగా వాడవచ్చని, దాన్ని ఆయుర్వేద మందుగా గుర్తించడంలేదని...
01-06-2021
Jun 01, 2021, 05:42 IST
సాక్షి,న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల...
01-06-2021
Jun 01, 2021, 05:23 IST
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): కరోనా నుంచి తొమ్మిది రోజుల పసికందును విశాఖ వైద్యులు రక్షించారు. 26 రోజుల చికిత్స అనంతరం...
01-06-2021
Jun 01, 2021, 04:42 IST
మంచం పట్టిన భర్త.. దివ్యాంగురాలైన కూతురు.. వయసు పైబడిన అత్త.. అందరి భారం ఆమెపైనే.. తన రెక్కల కష్టంపై అందరినీ...
01-06-2021
Jun 01, 2021, 04:26 IST
కరోనా వైరస్‌ వ్యాప్తి ఏడాదిన్నర కింద చైనాలో మొదలై.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. మొదట్లో కరోనా కేసులు భారీగా నమోదై తగ్గిన...
01-06-2021
Jun 01, 2021, 04:19 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లందరికీ టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 3వ...
01-06-2021
Jun 01, 2021, 04:06 IST
సాక్షి, హైదరాబాద్‌: 18004194961. ఇది కోవిడ్‌–19 టీకా కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌ సౌకర్యాలు లేకున్నా...
01-06-2021
Jun 01, 2021, 03:59 IST
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కోవిడ్‌ టీకా విధానంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీకా విధానంలోని...
01-06-2021
Jun 01, 2021, 03:04 IST
జెనీవా: భారత్‌లో తొలుత వెలుగుచూసిన కోవిడ్‌ వేరియంట్లు బి.1.617.1, బి.1.617.2లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కప్పా, డెల్టా అనే...
01-06-2021
Jun 01, 2021, 02:55 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌ కరాళనృత్యం మే నెలలో స్పష్టంగా కనిపించింది. దేశంలో సెకండ్‌వేవ్‌లో కరోనా విజంభృణ పెరగడంతో నమోదైన మొత్తం...
31-05-2021
May 31, 2021, 17:12 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా వైరస్‌, బ్లాక్‌ఫంగస్, బాధితులకు అందుతున్న వైద్యం, ఆక్సిజన్‌ సరఫరా, నిల్వలపైన సోమవారం...
31-05-2021
May 31, 2021, 15:37 IST
సాక్షి,బళ్లారి(కర్ణాటక): కరోనా కష్టకాలం ఓ కుటుంబానికి కడుపుకోత తీర్చింది. 13 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన కుమారుడు లాక్​డౌన్​ కారణంగా తిరిగి అమ్మ...
31-05-2021
May 31, 2021, 14:56 IST
పట్నా: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక రాష్ట్రాలు లాక్​డౌన్​ను పాటిస్తున్నాయి.  దీని​ వలన...
31-05-2021
May 31, 2021, 13:55 IST
ఆస్రేలియా(కాన్బెర్రా): నెల రోజుల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఆస్ట్రేలియా క్రికెటర్‌ డెవిడ్‌ వార్నర్‌ సోమవారం తన కుటుంబాన్ని కలిశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను...
31-05-2021
May 31, 2021, 03:49 IST
సాక్షి, హైదరాబాద్‌:  కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం...
31-05-2021
May 31, 2021, 03:38 IST
సాక్షి, విశాఖపట్నం: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ మహమ్మారిని ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యల వల్ల సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని కేంద్ర...
31-05-2021
May 31, 2021, 02:59 IST
సాక్షి, హైదరాబాద్‌:     కోవిడ్‌ టీకా తీసుకోవా లనుకునేవారు తమ పేరును ఇక పోస్టాఫీసు నుంచి కూడా నమోదు చేసుకోవచ్చు....
31-05-2021
May 31, 2021, 00:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మృతుల సంఖ్య పెరగడంతో ఉద్యోగుల్లో ఏర్పడిన భయాందోళనలు తొలగించేందుకు, ఆర్జిస్తున్న ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబాలకు ఆసరాగా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top