సీహెచ్‌సీల్లోనూ కోవిడ్‌ చికిత్స!

Covid Treatment Also In Community Health Centers - Sakshi

ప్రజలకు మరింత చేరువగా సేవలను విస్తరిస్తున్న ప్రభుత్వం

ఇప్పటివరకూ బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లోనే సేవలు

కొత్త ఆస్పత్రుల గుర్తింపు.. థర్డ్‌వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేలా ఏర్పాట్లు

ప్రతి సీహెచ్‌సీలో పీడియాట్రిక్‌ డాక్టర్లు

మరో 10 ప్రైవేట్‌ ఆస్పత్రులనూ గుర్తించిన అధికారులు 

సాక్షి, అమరావతి: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్‌ చికిత్సలను రాష్ట్ర ప్రభుత్వం కింది స్థాయి ఆస్పత్రులకూ విస్తరిస్తోంది. ఇప్పటివరకూ బోధనాసుపత్రులు, జిల్లా ఆస్పత్రులకే కోవిడ్‌ చికిత్సలు పరిమితమయ్యాయి. మూడో వేవ్‌ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇకపై సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కోవిడ్‌ చికిత్సలు అందించేలా వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 30 నుంచి 50 పడకల వరకూ ఉంటాయి. వీటిల్లో గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా వైద్యుల బృందం ఉంటుంది. 18ఏళ్ల లోపు పిల్లలకు కోవిడ్‌ సోకినా ఇబ్బందులు తలెత్తకుండా సీహెచ్‌సీల్లోనూ సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల బాధితులకు సత్వరమే సమీపంలోనే సేవలు అందనున్నాయి. 24 గంటలూ కరెంటు ఉండేలా చర్యలు చేపట్టారు.

వెంటనే ఆస్పత్రికి చేరుకునేలా..
సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు కలిపి 50కిపైగా ఆస్పత్రులను కోవిడ్‌ చికిత్సకు సిద్ధం చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇవికాకుండా 10 ప్రైవేట్‌ ఆస్పత్రులున్నాయి. ఇంతకుముందు వీటిల్లో కోవిడ్‌ సేవలు అందించలేదు. కొత్తగా కోవిడ్‌ చికిత్స కోసం వీటిని సిద్ధం చేస్తున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు సాధారణంగా నియోజకవర్గ స్థాయిలోనే ఉంటాయి కాబట్టి జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. పైగా తక్షణమే ఆస్పత్రికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆస్పత్రుల్లో కొత్తగా ఆక్సిజన్‌ సిలిండర్లు, పడకలు, వార్డుల పునరుద్ధరణ చేపట్టారు. కోవిడ్‌కు అవసరమైన మౌలిక వసతులను అన్నిటినీ ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ సమర్థంగా చికిత్స అందించేలా వసతులు కల్పిస్తున్నారు. పీడియాట్రిక్‌ వైద్యులు లేని చోట్ల తక్షణమే నాన్‌కోవిడ్‌ ఆస్పత్రులకు చెందిన పిల్లల వైద్యులను నియమిస్తారు.

ఏ జిల్లాలో ఎక్కడ..?
► అనంతపురం: అనంతపురం సీడీహెచ్, గుత్తి, కల్యాణదుర్గం, మడకశిర, పెనుగొండ,ఉరవకొండ సీహెచ్‌సీలు
► తూర్పు గోదావరి: రంపచోడవరం, తుని (ఏరియా ఆస్పత్రి), అడ్డతీగల, చింతూరు, గోకవరం, పి.గన్నవరం, పెద్దాపురం, పత్తిపాడు, రాజోలు, ఏలేశ్వరం సీహెచ్‌సీలు
గుంటూరు: చిలకలూరిపేట, సత్తెనపల్లి (ఏరియా ఆస్పత్రులు), ఫీవర్‌ ఆస్పత్రి
ప్రకాశం: గిద్దలూరు,యర్రగొండపాలెం (ఏరియా ఆస్పత్రులు), డోర్నాల, కంభం సీహెచ్‌సీలు, ఎంసీహెచ్‌ ఒంగోలు
చిత్తూరు: మహల్, పుత్తూరు, సత్యవేడు, వాయల్పాడు సీహెచ్‌సీలతో పాటు తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రి
పశ్చిమ గోదావరి: భీమవరం,చింతలపూడి, నరసాపురం,పాలకొల్లు (ఏరియా ఆస్పత్రులు), కొవ్వూరు, నిడదవోలు సీహెచ్‌సీలు
కృష్ణా: జీజీహెచ్‌ సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ (విజయవాడ), సీహెచ్‌సీ మైలవరం
శ్రీకాకుళం: నరసన్నపేట, సీతంపేట ఏరియా ఆస్పత్రులు
కడప: జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి (ఏరియా ఆస్పత్రులు), బద్వేల్, పోరుమామిళ్ల, వేంపల్లి, మైలవరం సీహెచ్‌సీలు
కర్నూలు: బనగానపల్లి, ఆదోని, ఎమ్మిగనూరు సీహెచ్‌సీలు
విశాఖపట్నం: అగనంపూడి (ఏరియా ఆస్పత్రి),చింతపల్లి, కోటపాడు, నక్కపల్లి, యలమంచిలి సీహెచ్‌సీలు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

29-06-2021
Jun 29, 2021, 19:30 IST
భౌతికదూరం పాటించకపోవడమేగాకుండా ముఖానికి మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
29-06-2021
Jun 29, 2021, 12:42 IST
బెంగళూరు: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్‌ కార్యక్రమంపై కరోనా మొదటి, రెండో వేవ్‌లు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయని...
29-06-2021
Jun 29, 2021, 12:34 IST
న్యూఢిల్లీ: యూరోపియన్‌ యూనియన్‌ ‘కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ పాస్‌పోర్ట్‌’లో కోవిషీల్డ్‌ టీకాను కూడా చేర్చే విషయంలో జోక్యం చేసుకోవాలని సీరం...
29-06-2021
Jun 29, 2021, 08:06 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌తో మృత్యువాతపడిన 77 మంది లాయర్లకు సుప్రీంకోర్టు నివాళులర్పించింది. వేసవి సెలవుల తర్వాత సోమవారం సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభం...
29-06-2021
Jun 29, 2021, 04:39 IST
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ విషయంలో భారత్‌ అమెరికా రికార్డును దాటేసింది. దేశంలో ఇప్పటివరకు 32.36 కోట్ల డోస్‌లను అందించారు....
29-06-2021
Jun 29, 2021, 03:14 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివిటీ రేటు కూడా కిందకు దిగివస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 15...
29-06-2021
Jun 29, 2021, 02:51 IST
అమరావతి: కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి మంచిపేరు వస్తోందని, దీన్ని తట్టుకోలేక తప్పుడు రాతలు రాస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు....
28-06-2021
Jun 28, 2021, 20:22 IST
సేరో సర్వే: 51 శాతానికిపైగా బాలబాలికల్లో కోవిడ్‌ యాంటీ బాడీలు
28-06-2021
Jun 28, 2021, 19:09 IST
యూఎస్‌సీ రాస్కి ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ క్లినికల్‌ ఆఫ్తాల్మాలజీ డాక్టర్‌ ఆనీ గ్యూయెన్‌ వంటివారు ‘కంటిపై కరోనా...
28-06-2021
Jun 28, 2021, 17:08 IST
పశ్చిమ బెంగాల్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపు.. సడలింపులు ఇలా!
28-06-2021
Jun 28, 2021, 13:08 IST
కరోనా వైరస్‌ మహమ్మారి ఎంతో మందిని బలి తీసుకుంటోంది. పైగా వైరస్‌లో కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తూ మనిషికి కునుకు లేకుండా...
28-06-2021
Jun 28, 2021, 03:47 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వచ్చి తగ్గిన తర్వాత కూడా సుదీర్ఘకాలం పాటు చాలామంది బాధితులను పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి....
27-06-2021
Jun 27, 2021, 14:56 IST
ఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడంపై సందిగ్ధతను అధిగమించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం 'మన్‌ కీ బాత్‌' ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు....
27-06-2021
Jun 27, 2021, 14:16 IST
ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కరోనా యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్ల అమ్మకాలు ప్రారంభించింది. "కోవిసెల్ఫ్‌" అనే రూ.250 ఖరీదైన ఈ...
27-06-2021
Jun 27, 2021, 11:29 IST
కరోనా వైరస్‌ మహమ్మారి కాలంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం పెరిగింది. 77 దేశాలలోని ఆరోగ్య నిపుణులను సర్వే చేయగా..
27-06-2021
Jun 27, 2021, 10:29 IST
మహారాష్ట్రలో డెల్లా ప్లస్‌ వేరియంట్‌ కేసులుపెరుగుతుండటం, థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినం చేశారు. ...
27-06-2021
Jun 27, 2021, 09:41 IST
న్యూఢిల్లీ: ఢిల్లీలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో తీవ్ర ఆక్సిజన్‌ కొరత ఏర్పడటంపై సుప్రీం కోర్టు ప్యానెల్‌ అంద జేసిన...
27-06-2021
Jun 27, 2021, 08:20 IST
సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. జూలై 1 నుంచి విద్యా సంస్థలన్నీ...
27-06-2021
Jun 27, 2021, 08:01 IST
సాక్షి, వాంకిడి(ఆదిలాబాద్‌): కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే జనజీవనం కుదుటపడుతున్న తరుణంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ భయపెడుతోంది....
27-06-2021
Jun 27, 2021, 04:19 IST
తిరుపతి, అన్నమయ్య సర్కిల్‌: కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా వైద్య...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top